1. రైతులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తక్కువ వడ్డీకే రుణాలను ప్రకటించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ లోన్ (SBI Agri Gold Loan) పేరుతో రుణాలను అందిస్తోంది. రైతులు ఎస్బీఐ యోనో యాప్‌లో అప్లై చేసి అతి తక్కువ వడ్డీతో రుణాలు పొందొచ్చు. ఈ వియాన్ని ట్విట్టర్లో వెల్లడించింది ఎస్బీఐ. సాధారణంగా ఎస్బీఐ రైతులకు రుణాలు ఇస్తూనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. యోనో యాప్ ద్వారా అప్లై చేస్తే వడ్డీ తక్కువగా ఉంటుంది. కేవలం 7 శాతం నుంచే వడ్డీ ప్రారంభం అవుతుంది. రుణాలు కూడా వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. సొంత పొలంలో లేదా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ గైడ్‌లైన్స్ ప్రకారం వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించేవారంతా ఈ రుణాలు పొందడానికి అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐ అగ్రి గోల్డ్ లోన్ బంగారు నగలపై లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. సాధారణంగా ఎస్బీఐలో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైతులు యోనో ఎస్బీఐ యాప్‌లో అప్లై చేస్తే 7 శాతం వడ్డీ వర్తిస్తుంది. మరి ఎస్బీఐ యోనో యాప్‌లో అగ్రి గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలతో యాప్‌లో లాగిన్ కావాలి. హోమ్ పేజీలో YONO Krishi పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Khata పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Agri Gold Loan పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Apply For Loan పైన క్లిక్ చేయాలి. రైతుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంత లోన్ కావాలో వెల్లడించాలి. ఎందుకోసం లోన్ తీసుకుంటున్నారో తెలపాలి. భూమి వివరాలు కూడా వెల్లడించాలి. దరఖాస్తు చేసిన రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్‌తో సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత లోన్ మంజూరవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)