1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేర్వేరు వర్గాలకు వేర్వేరు అకౌంట్స్‌ని అందిస్తోంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ స్మాల్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ ప్లస్ అకౌంట్... ఇలా వేర్వేరు బ్యాంక్ అకౌంట్లను (Bank Account) అందిస్తోంది. వీటితో పాటు ఎస్బీఐ త్రీ ఇన్ వన్ అకౌంట్ (SBI 3-in-1 Account) అకౌంట్ కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంటే ఒకే అకౌంట్లో మూడు రకాల అకౌంట్స్ ఉంటాయని అర్థం. వీటిలో ఒకటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, రెండోది డీమ్యాట్ అకౌంట్, మూడోది ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి కోసం ప్రత్యేకంగా అందిస్తున్న అకౌంట్ ఇది. మూడు వేర్వేరు అకౌంట్లు తీసుకోకుండా ఒకే అకౌంట్ తీసుకుంటే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ కావాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. ఈ మూడు అకౌంట్లను వేర్వేరుగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే మూడు అకౌంట్లు ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్‌తో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఈ అకౌంట్లో కూడా లభిస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ లేదా ఫామ్ 16, ఫోటో, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి. ఈ డాక్యుమెంట్స్‌తో మీకు సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎస్బీఐ త్రీ ఇన్ వన్ అకౌంట్లో డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు కూడా ఉంటాయి కాబట్టి పాన్ కార్డ్ తప్పనిసరి. వీటితో పాటు లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్, క్యాన్సల్డ్ చెక్, ఫోటో ఇవ్వాలి. ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే ఇవన్నీ తప్పనిసరి. ఎస్బీఐ త్రీ ఇన్ వన్ అకౌంట్ హోల్డర్స్ 25 శాతం మార్జిన్స్‌తో ట్రేడ్ చేయొచ్చు. 30 రోజుల వరకు పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ట్రేడింగ్ స్టాక్స్‌ని డెలివరీగా మార్చుకోవచ్చు. ఎక్స్పైరీ లోపు స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు. కస్టమర్లు తమ దగ్గర ఉన్న షేర్స్‌ని ప్లెడ్జ్ చేసి లోన్ కూడా తీసుకోవచ్చు. ఎస్బీఐ సెక్యూరిటీ వెబ్ ప్లాట్ఫామ్లో లాగిన్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా లాగిన్ అయి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే ఐపీఓల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ స్మాల్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మైనర్లకు సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ ప్లస్ అకౌంట్, ఇన్‌స్టా ప్లస్ వీడియో కేవైసీ అకౌంట్ లాంటి వేర్వేరు అకౌంట్స్ కూడా ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాలకు సరిపోయే అకౌంట్ ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)