అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించడానికి ప్రయత్నించాలి. అప్పుడు రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. షేరు ధర తగ్గినప్పుడు భయపడి వెంటనే ఆ షేర్లను అమ్మేస్తే.. పోయిన డబ్బులు తిరిగి రావు. నష్టాలతో బయట పడాల్సి వస్తుంది. అందుకే స్టాక్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే అంశాలను కూడా బాగా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.