బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో అయితే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ.2 వేలు వరకు ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఇదే విధమైన మినిమమ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ అవసరం అవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యావరేజ్ క్వార్టరీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఉండాలి. కెనరా బ్యాంక్‌లో అయితే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ.1000గా ఉండాలి.
యాక్సిస్ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 12 వేల వరకు ఉండాలి. బంధన్ బ్యాంక్‌లో అయితే రూ.5 వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. క్యాథోలిక్ సిరియన్ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 5 వేలు వరకు ఉంది. సిటీ యూనియన్ బ్యాంక్‌లో మంత్లీ బ్యాలెన్స్ రూ. 7500 ఉండాలి. డీసీబీ బ్యాంక్‌లో మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 5 వేలు వరకు ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంక్‌లో మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1000గా ఉంది. ఫెడరల్ బ్యాంక్‌లో మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 5 వేలుగా ఉండాలి.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 10 వేలుగా ఉండాలి. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ. 1500 నుంచి రూ. 10 వేల వరకు ఉండాలి. జే అండ్ కే బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2 వేలు. కర్నాటక బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 1000 నుంచి రూ.2 వేల వరకు ఉండాలి.
కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉండాలి. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 5 వేలు ఉండాలి. ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్లు రూ. 2500 నుంచి రూ. 5 వేల వరకు మంత్లీ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. యస్ బ్యాంక్ కస్టమర్లు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో రూ.1000 నుంచి రూ. 2500 వరకు మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ ఉండాలి.
అలాగే ఏయూ స్మార్ట్ ఫైనాన్స్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఉంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ. 2500 నుంచి రూ. 10 వేల వరకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. సూర్యోదయ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.2 వేల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉండాలి. ఉజ్జీవన్ బ్యాంక్‌లో యావరేజ్ బ్యాలెన్స్ అక్కర్లేదు .