వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల అదిరే రాబడి పొందొచ్చు. కచ్చితమైన లాభం వస్తుంది. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు సిప్ రూపంలో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. లేదంటే ఏడాదిలో ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టొచ్చు.
అలాగే మీరు పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ వెళ్లొచ్చు. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. లేదంటే బ్యాంక్‌కు వెళ్లి కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో చేరొచ్చు. మీరు ఎందులో అయినా పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆటోడెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. డబ్బులు మీ అకౌంట్ నుంచే ప్రతి నెలా కట్ అవుతాయి.