1. రైలు నెంబర్ 07435 సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి 2022 జనవరి 13న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో కాజిపేట జంక్షన్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, తునిలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07436 అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు 2022 జనవరి 14న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6.30 గంటలకు అనకాపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో తుని, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, నిడదవోలు జంక్షన్, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట జంక్షన్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 07489 సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ వరకు 2022 జనవరి 12న అందుబాటులో ఉంటుంది. ఈ జన్ సాధారణ్ రైలు రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో ఘట్కేసర్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 07437 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 2022 జనవరి 12న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో జనగామ్, కాజిపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 17435 కాచిగూడ నుంచి కర్నూల్ సిటీ వరకు 2022 జనవరి 12 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.35 గంటలకు కాచిగూడలో బయల్దేరి రాత్రి 11.40 గంటలకు కర్నూల్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో ఫలక్నుమా, ఎన్పీఏ శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, రంగారెడ్డిగూడ, రాజాపూర్, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, మహబూబ్నగర్, మహబూబ్నగర్ టౌన్, వనపర్తి రోడ్, గద్వాల జంక్షన్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైలు నెంబర్ 17436 కర్నూల్ సిటీ నుంచి కాచిగూడ వరకు 2022 జనవరి 13 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 7.00 గంటలకు కర్నూలులో బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో గద్వాల జంక్షన్, వనపర్తి రోడ్, మహబూబ్నగర్ టౌన్, మహబూబ్నగర్, దివిటిపల్లి, జడ్చర్ల, గొల్లపల్లి, రాజాపూర్, రంగారెడ్డిగూడ, బాలానగర్, బూర్గుల, షాద్నగర్, తిమ్మాపూర్, ఉందానగర్, బుద్వేల్, ఎన్పీఏ శివరాంపల్లి, ఫలక్నుమా స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో సాధారణంగా రైళ్లు ఆగే ప్లాట్ఫామ్స్ సంఖ్య మారింది. రైలు నెంబర్ 12728 హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్, రైలు నెంబర్ 12738 లింగంపల్లి-కాకినాడ పోర్ట్ గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లు ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి బదులుగా ప్లాట్ఫామ్ నెంబర్ 10 లో ఆగుతాయి. ఇక రైలు నెంబర్ 22692 హజ్రత్ నిజాముద్దీన్-బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 10 బదులు ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)