1. సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా? సెలవుల్లో సొంతూరికి వెళ్లి పండుగ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారా? ఊరెళ్లేందుకు రైలు టికెట్ దొరకలేదా? సాధారణంగా రిజర్వేషన్ ద్వారా ట్రైన్ టికెట్ దొరకనివారిని తత్కాల్ బుకింగ్ (Tatkal Ticket Booking) ఆదుకుంటూ ఉంటుంది. కరోనా వైరస్ ఆంక్షల తర్వాత ఇటీవల రైలు సర్వీసుల్ని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. సంక్రాంతి సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని రద్దీని క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains) ప్రకటిస్తోంది. ఈ రైళ్లకు టికెట్ బుకింగ్ కొనసాగుతోంది. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్లు బుక్ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది. సాధారణ బుకింగ్‌లో రైలు టికెట్ దొరక్కపోతే తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే తత్కాల్ టికెట్ బుక్ చేసే ముందు నియమనిబంధనలన్నీ సరిగ్గా తెలుసుకుంటే టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లకు వేర్వేరుగా ఉంటుంది. ఏసీ కోచ్‌లో తత్కాల్ టికెట్లకు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ కోచ్‌లో తత్కాల్ టికెట్లకు ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. రేపు బయల్దేరే రైలు కోసం ఈరోజు తత్కాల్ టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. తత్కాల్ టికెట్లకు పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతుంటాయి. కాబట్టి తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకునేవారు సరిగ్గా ఆ సమయానికి సిద్ధంగా ఉండాలి. వివరాలన్నీ అందుబాటులో పెట్టుకొని బుకింగ్ చేయాలి. బుకింగ్ మొదలైన తర్వాత వివరాల కోసం వెతుక్కోకూడదు. తత్కాల్ టికెట్లు బుక్ చేయాలనుకునేవారు ముందుగానే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రయాణికుల వివరాలు సేవ్ చేసి పెట్టుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఒకసారి వివరాలు సేవ్ చేస్తే ఎప్పుడైనా ఆ వివరాలతో బుకింగ్ ప్రాసెస్ వేగంగా పూర్తి చేయొచ్చు. మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తున్నట్టైతే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మీ వివరాలు, మీ కుటుంబ సభ్యుల వివరాలు సేవ్ చేస్తే ప్రతీసారి టికెట్ బుకింగ్ చేసే సమయంలో మళ్లీ మళ్లీ వివరాలన్నీ వెల్లడించాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. తత్కాల్ టికెట్ బుక్ చేసే సమయంలో add existing పైన క్లిక్ చేసి ప్రయాణికుల పేరు సెలెక్ట్ చేస్తే చాలు. వివరాలన్నీ ఆటోమెటిక్‌గా యాడ్ అవుతాయి. పేమెంట్ చేసి టికెట్ బుకింగ్ పూర్తి చేయొచ్చు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ చేయడానికి యూపీఐ మోడ్ సెలెక్ట్ చేయడం మంచిది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసే లోపు తత్కాల్ కోటా పూర్తై పోవచ్చు. లేదా ఐఆర్సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ముందే డబ్బులు లోడ్ చేసి పెట్టుకుంటే పేమెంట్ త్వరగా పూర్తి చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. తత్కాల్ టికెట్లకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్ క్లాస్ టికెట్లకు రూ.10 నుంచి రూ.15, స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.100 నుంచి రూ.200, ఏసీ చైర్ కార్ టికెట్లకు రూ.125 నుంచి రూ.225, థర్డ్ ఏసీ టికెట్లకు రూ.300 నుంచి రూ.400, సెకండ్ ఏసీ, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్లకు రూ.400 నుంచి రూ.500 ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)