1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జనవరి 19న సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలును ప్రారంభిస్తారన్న వార్తలొచ్చాయి. అయితే తెలంగాణలో మోదీ పర్యటన వాయిదా పడింది. దీంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం కూడా వాయిదా పడుతుందని భావించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. జనవరి 19 కాకుండా అంతకన్నా ముందుగానే ఈ రైలు పరుగులు తీయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుకగా, పండుగ రోజున అంటే జనవరి 15న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఇది సంక్రాంతి కానుక అని, రెండు రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని పెంచుతుందని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 8వ వందే భారత్ రైలును జనవరి 15 ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనవరి 15న జరగబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. అయితే ప్రయాణికులకు వందే భారత్ రైలు అదే రోజున అందుబాటులోకి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అయితే ట్రయల్ రన్ కోసం వచ్చిన వందే భారత్ రైలుపై బుధవారం రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత మర్రిపాలెంలోని కోచ్ మెయింటనెన్స్ సెంటర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు కిటికీల అద్దాలు పగిలిపోయాయి. రైల్వే ప్రొటెషన్ ఫోర్స్ కేసు నమోదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక వందే భారత్ రైలు ప్రత్యేకతలు చూస్తే భారతీయ రైల్వే తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును 2019లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై, నాగ్పూర్-బిలాస్పూర్, హౌరా-న్యూజల్పాయ్గురి రూట్లల్లో వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో 8వ వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. వందే భారత్ రైలు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)