ఇప్పటికే పలు రకాలుగా రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్యా నుంచి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులపై పలు దేశాలు బ్యాన్ విధించాయి. ఇప్పుడు తాజాగా జీ-7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా ఎగుమతుల్లో అత్యంత ముఖ్యమైన బంగారంపై ఆంక్షలను విధించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రష్యా బంగారాన్ని కొనేది లేదని.. వాటి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు జీ - 7 దేశాలైన అమెరికా, బ్రిటన్, జపాన్ , కెనడా ప్రకటించాయి. ఈ నిర్ణయాన్ని మొదట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సదస్సులో ప్రకటించాడు. అతడి నిర్ణయానికి జీ 7 సభ్యదేశమైన బ్రిటన్ ఏకీభవించింది. జపాన్, కెనడాలు కూడా బంగారం దిగుమతిని నిషేదించేందుకు ప్రకటనలు చేయనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రానున్న కాలంలో ఇండియాలో బంగారం ధర ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పడికే ఉక్రెయిన్-రష్యా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రభావం చూపిస్తుండటంతో.. భారత్‌లోనూ దాని ప్రభావం పడింది. క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)