RTGS Services | మీరు తరచూ మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారా? ఆర్టీజీఎస్ సేవల్ని ఉపయోగిస్తుంటారా? 14 గంటలపాటు ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎందుకో తెలుసుకోండి.
1. మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి అలర్ట్. దేశవ్యాప్తంగా రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సేవలు14 గంటల పాటు నిలిచిపోనున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. ఆర్టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్టీజీఎస్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. ఏప్రిల్ 18 ఆదివారం అర్థరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్బీఐ ప్రకటించింది. సుమారు 14 గంటల పాటు ఆర్టీజీఎస్ సేవల్ని వేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి కస్టమర్లు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్-NEFT సేవల్ని ఉపయోగించుకోవచ్చు. నెఫ్ట్ సేవలు యథావిథిగా అందుబాటులో ఉంటాయి. నెఫ్ట్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఏప్రిల్ 18న 14 గంటల పాటు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని, పేమెంట్స్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్న విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. రూ.2,00,000 కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. రూ.2,00,000 కన్నా ఎక్కువ ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. అంటే కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గతంలో ఆర్టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. భారతదేశంలో ఆర్టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2019 జూలైలో ఆర్టీజీఎస్తో పాటు నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)