Bitcoin: అప్పుడు అకౌంట్‌లో మర్చిపోయిన బిట్‌కాయిన్ల విలువ ఇప్పుడు రూ.216 కోట్లు

Bitcoin | బిట్‌కాయిన్... ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. బిట్‌కాయిన్‌ను (bitcoin) కూడా ఓ పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు ఇన్వెస్టర్లు. భారతీయులు కూడా క్రిప్టోకరెన్సీలో (cryptocurrency) పెట్టుబడులు పెడుతున్నారు. ఒక అకౌంట్‌లో 9 ఏళ్ల క్రితం మర్చిపోయిన బిట్‌కాయిన్ల విలువ ఇప్పుడు రూ.216 కోట్లు దాటింది.