స్టాక్ మార్కెట్లో(Stock Market) పెట్టుబడులు పెట్టడం అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో సమానం. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు బిజినెస్ మోడల్, భవిష్యత్తులో రాణించే అవకాశాలను ఏస్ ఇన్వెస్టర్స్(Ace Investors), వెంచర్ క్యాపటలిస్ట్స్, ఇతర ఇన్వెస్టర్స్ పరిశీలిస్తారు. ఈ రెండు అంశాలు నచ్చిన తర్వాతనే చిన్న, లేదా మధ్య తరగతి కంపెనీలలో డబ్బులు పెడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు కూడా ఇలానే ఆలోచించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక్కసారి ఏదైనా కంపెనీలో షేర్లు కొనుగోలు చేస్తే వీలైనంత ఎక్కువ కాలం అందులో డబ్బులు ఉంచగలగాలి. అప్పుడే కాంపౌండింగ్ బెనిఫిట్, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం దక్కుతాయి. GRM Overseas కంపెనీ షేర్లు అందుకు చక్కటి ఉదాహరణ. రైస్ మిల్లింగ్ కంపెనీ అయిన GRM Overseas షేర్ విలువు ఐదు సంవత్సరాలలో రూ.3 నుంచి రూ.591.90కి చేరింది. ఐదేళ్ల కాలంలో దాదాపు GRM Overseas షేరు 200 రెట్లు వృద్ధి సాధించింది. (ప్రతీకాత్మక చిత్రం)
GRM Overseas ప్రైస్ హిస్టరీ
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలపై వివిధ రకాల ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచంలోని అన్ని స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. ఇదే కోవలో గత నెల GRM Overseas సెల్ ఆఫ్ హీట్‌ను ఎదుర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ దీనిపై కూడా కనిపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏడాది కాలాన్ని పరిశీలిస్తే GRM Overseas మల్టీబ్యాగర్ స్టాక్ రూ.68 నుంచి ఏకంగా రూ.591.90కి చేరింది. ఈ పీరియడ్‌లో దాదాపు 770 శాతం వృద్ధిని చూపింది. అదే విధంగా స్టాక్ మార్కెట్లో BSEలో లిస్ట్ అయిన (2016 మార్చి 11) నుంచి 2022 మార్చి 4వ తేదీ వరకు 19,900 శాతం వృద్ధిని సాధించింది. రూ.3తో లిస్ట్ అయిన కంపెనీ షేరు ఆరేళ్లలో రూ.591.90కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.కోట్లు
GRM Overseas మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఓ నెల క్రితం రూ.లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ.83,000 వేలు అయి ఉండేది. అదే విధంగా ఆరు నెలల క్రితం పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు రూ.3 లక్షలు అయి ఉండేది. ఒక సంవత్సరం క్రితం పెట్టి ఉంటే ప్రస్తుతం ఆ విలువ రూ.8.70కి చేరి ఉండేది. అదే ఆరేళ్ల క్రితం ఈ పెన్నీస్టాక్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ సమయానికి రూ.2 కోట్లకు చేరి ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
GRM Overseas షేర్ ప్రైస్ ఔట్లుక్.. GRM Overseas షేర్ ప్రైస్ ఛార్ట్ ప్యాటర్న్ గురించి ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. ‘GRM Overseas షేర్లు 200 రోజుల మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. 2022వ సంవత్సరం జనవరి లో ఆల్ టైమ్ హై రూ.935.40కి చేరిన తర్వాత షేర్ పతనం మొదలైంది. (ప్రతీకాత్మక చిత్రం)