స్టాక్ మార్కెట్లు అనేవి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు లాభాలను పండిస్తాయని అంతా అంటుంటారు. మనీకంట్రోల్ నిర్వహించిన ఓ పరిశోధనలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
స్టాక్ మార్కెట్లు అనేవి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు లాభాలను పండిస్తాయని అంతా అంటుంటారు. మనీకంట్రోల్ నిర్వహించిన ఓ పరిశోధనలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. BSEలోని ఆరు స్టాక్స్‌లో పదేళ్ల క్రితం రూ.2లక్షలు పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు రూ.కోట్ల వరకు ఆర్జించారు.
2/ 7
Avanthi Feeds అనే సంస్థ స్టాక్స్ 29,150 శాతం పెరిగింది. పదేళ్ల క్రితం ఒక షేర్ విలువ రూ.1.55 ఉన్న స్థితి నుంచి ప్రస్తుతం రూ.453కి దూసుకెళ్లింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.5.83 కోట్లు అయ్యి ఉండేది.
3/ 7
Caplin Point Laboratories ఈ సంస్థ స్టాక్ ధర 11,053 శాతం వృద్ధి నమోదు చేసింది. పదేళ్ల క్రితం రూ. 3.16 ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ.352.45కు పెరిగింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.2.21 కోట్లు అయ్యి ఉండేది.
4/ 7
Bharat Rasayan స్టాక్ ధర 6,324 శాతం వృద్ధి నమోదు చేసింది. పదేళ్ల క్రితం రూ. 110.50 ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ.7099 కు పెరిగింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.1.26 కోట్లు అయ్యి ఉండేది.
5/ 7
Ajanta Pharma స్టాక్ ధర 5,818 శాతం వృద్ధి నమోదు చేసింది. పదేళ్ల క్రితం రూ.25.04 ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ. 1481.85కు పెరిగింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.1.16 కోట్లు అయ్యి ఉండేది.
6/ 7
Alkyl Amines Chemicals స్టాక్ ధర 5,162 శాతం వృద్ధి నమోదు చేసింది. పదేళ్ల క్రితం రూ. 40.03 ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ.2106.15 కు పెరిగింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.1.03 కోట్లు అయ్యి ఉండేది.
7/ 7
Bajaj Finance స్టాక్ ధర 5,085 శాతం వృద్ధి నమోదు చేసింది. పదేళ్ల క్రితం రూ.45.07 ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ.2337.15 కు పెరిగింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.1.02 కోట్లు అయ్యి ఉండేది.