ఇటీవలి సంవత్సరాలలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇండియాలో బిజినెస్‌ను విస్తరిస్తోంది. ముఖ్యంగా 650 ట్విన్స్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650తో దాదాపు 60 దేశాల్లో సేల్స్ పెంచుకుంది. ఈ సిరీస్‌లో మూడో మోటార్ సైకిల్.. సూపర్ మెటోర్ 650 మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం సూపర్ మెటోర్ 650 బుకింగ్స్ ప్రారంభం కాగా, ఫిబ్రవరిలో డెలివరీలు స్టార్ట్ అవ్వనున్నాయి. ఈ లేటెస్ట్ బైక్‌పై న్యూస్18 రివ్యూ ఇదే. (PC : Royal Enfield)
* సూపర్ మెటోర్ 650 రైడ్ : సూపర్ మెటోర్ 650 అనేది రాయల్ ఎన్ఫీల్డ్ అందిస్తున్న మొదటి ప్రాపర్ 'క్రూజర్' మోటార్‌సైకిల్. దీంట్లో ఫుల్లీ ఫీట్ ఫార్వర్డ్ ఫుట్ కంట్రోల్స్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్, వైడ్ హ్యాండిల్‌బార్ అత్యంత కచ్చితత్వంతో ఉన్నాయి. రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్ ఆకట్టుకుంటుంది. సూపర్ మెటోర్ 650 హైవేలపై లాంగ్ రైడ్లకు బాగా సరిపోతుంది. 740 మిమీ సీటు ఎత్తు, కొంచెం పొట్టిగా ఉన్నవారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. బైక్ వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కూడా స్థిరంగా ఉంటుంది. (PC : Royal Enfield)
ఈ బైక్‌పై గంటకు 150 కిమీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంటే చిన్నపాటి వైబ్రేషన్లు రావచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్లో USD ఫోర్క్‌లు, వెనుకవైపు 5-స్టెప్ ప్రీలోడ్‌తో కూడిన షాక్ అబ్జార్బర్ల ద్వారా రైడ్ నాణ్యత మరింత పెరిగింది. సస్పెన్షన్ సెటప్ అద్భుతంగా ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు వైపున 320 mm డిస్క్ యూనిట్, వెనుక భాగంలో 220 mm డిస్క్ యూనిట్ ఉంటాయి. వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ వేసినా.. అస్సలు స్కిడ్ కాదు. (PC : Royal Enfield)
* సూపర్ మెటోర్ 650 హ్యాండ్లింగ్ : హ్యాండ్లింగ్ విషయానికి వస్తే.. అధిక వేగంతో హైవేలపై దూసుకెళ్లవచ్చు. ట్రాఫిక్ మధ్య ఇరుకైన నగర రోడ్లపై షార్ప్ టర్న్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. 241 కిలోల కర్బ్ వెయిట్‌తో ఇప్పటి వరకు అత్యంత బరువైన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్ అయినప్పటికీ, ఇది ప్రయాణంలో ఆ అనుభూతిని కలిగించదు. (PC : Royal Enfield)
* సూపర్ మెటోర్ 650 ఇంజిన్, పనితీరు : సూపర్ మెటోర్ 650 మోటార్ సైకిల్.. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650లలో చూసిన అదే 648cc ఎయిర్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అయితే దీనికి కొత్త కేసింగ్ రూపంలో కొన్ని అప్డేట్లు ఇచ్చారు, ECU రీమ్యాప్ చేశారు. పవర్, టార్క్ గణాంకాలు కూడా వరుసగా 7,250 rpm వద్ద 46.7 bhp, 5,650 rpm వద్ద 52.3 Nm వద్ద ఒకేలా ఉంటాయి. (PC : Royal Enfield)
రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించింది, ఇది పెట్రోల్ ఇంజన్‌తో కలిసి బాగా పనిచేస్తుంది. గేర్‌షిఫ్ట్ మరింత సున్నితంగా ఉంది. 241 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ, సూపర్ మెటోర్ 650 చురుకైన యాక్సలరేషన్ అందిస్తుంది. నిశ్చలంగా 100kmph మార్కును చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. (PC : Royal Enfield)
* సూపర్ మెటోర్ 650 డిజైన్, ఫీచర్లు : సూపర్ మెటోర్ 650 అనేది బ్రాండ్ నుంచి వచ్చిన సరికొత్త మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది. గత రెండు మోడళ్ల కంటే దీని స్టైలింగ్ కాస్త భిన్నంగా ఉంది. దీంతో చూడటానికి కొత్త మోడల్ అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ ఆధారంగా చూస్తే ఇది 1,500 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది. టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, పొడవైన ఫెండర్లు వాటి స్థానంలో పరిపూర్ణంగా కనిపిస్తాయి. (PC : Royal Enfield)
ముందు వైపు 19-అంగుళాలు, వెనుక 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ విస్తృత ట్యూబ్‌లెస్ టైర్లతో మోటార్‌సైకిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తోంది.సూపర్ మెటోర్ 650 ఐదు సింగిల్-టోన్ కలర్స్.. ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్స్టెల్లార్ గ్రే, ఇంటర్స్టెల్లార్ గ్రీన్‌లో అందుబాటులో ఉంటుంది. క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను సెలెస్టియల్ రెడ్, సెలెస్టియల్ బ్లూ రూపంలో రెండు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో కూడా పొందవచ్చు. (PC : Royal Enfield)
* సూపర్ మెటోర్ 650 ఫీచర్లు : సూపర్ మెటోర్ 650 బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్, ఛార్జింగ్ కోసం USB సాకెట్, LCD డిస్ప్లేతో అనలాగ్ స్పీడోమీటర్‌ను అందిస్తుంది. ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ నేరుగా సూపర్ మెటోర్ 350 నుంచి స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది. స్పీడోమీటర్లోని LCD డిస్ప్లే రైడర్‌కు revs, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్, ట్రిప్ మీటర్ వంటి సమాచారం లభిస్తుంది. (PC : Royal Enfield)
* సూపర్ మెటోర్ 650 ధర, వేరియంట్లు : సూపర్ మెటోర్ 650 ధర రూ.3.49 లక్షలతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇదే. ఇందులో సూపర్ మెటోర్ 650, సూపర్ మెటోర్ 650 టూరర్ అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టూరర్ ధర రూ.3.49-3.79 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్, ఇండియా). టూరింగ్ విండ్‌స్క్రీన్, డీలక్స్ టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్‌రెస్ట్ రూపంలో టూరర్ గ్రేడ్ కొన్ని అదనపు ఫీచర్లు పొందుతుంది. (PC : Royal Enfield)
* మార్కెట్లో పోటీ ఉందా? : రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 సంపూర్ణమైన ప్యాకేజీగా వస్తుంది. కస్టమర్‌ని నిరాశపరిచే అంశాలు ఏవీ లేవు. మోటార్‌సైకిల్‌లో ఫీచర్ల కొరత లేదు. బ్రాండ్ కస్టమర్ల కోసం మరికొన్ని కలర్ ఆప్షన్లు పరిచయం చేస్తే మంచిది. సూపర్ మెటోర్ 650కి భారతీయ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థి లేరు. ఇది క్రూయిజర్ విభాగంలో దాని ఆధిపత్యానికి మార్గం సుగమం చేస్తుంది. (PC : Royal Enfield)