1. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల రైడర్ మేనియా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతీ ఏటా నిర్వహించే కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఇది. ఈ కార్యక్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఓ ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ షోపీస్‌లుగా పెట్టుకోవడానికి ఇలాంటివి కొంటూ ఉంటారు. (image: Royal Enfield)
2. రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్‌లోని స్టోర్‌లో ఇలాంటి షోపీస్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఇలాంటివన్నీ రూ.2,000 లోపు అందుబాటులో ఉంటాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన 1:3 స్కేల్ మోడల్ ధర రూ.67,990. అంటే ఇతర బ్రాండ్లకు చెందిన బైక్ ధరకు రాయల్ ఎన్ఫీల్డ్ షోపీస్ లభిస్తుందన్నమాట. (image: Royal Enfield)
3. రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ కలెక్టబుల్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. రూ.2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 8 కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. టీల్ గ్రీన్, గన్ గ్రే, క్రోమ్ బ్లాక్, రెడ్ డిచ్, రెడ్ మెరూన్, క్రోమ్ బ్యాటిల్, గ్రీన్ డిసర్ట్, స్టార్మ్ జెట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Royal Enfield)
4. రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ కలెక్టబుల్ ధర ఇంత ఉండటానికి కారణం దీన్ని చేతితో తయారు చేయడమే. రాయల్ ఎన్ఫీల్డ్ హస్తకళా నైపుణ్యానికి ఇది వారసత్వం అని కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ కలెక్టబుల్ బరువు సుమారు 8.5 కిలోలు ఉంటుంది. 1:3 నిష్పత్తిలో ఉంటుంది. (image: Royal Enfield)