1. రాయల్ ఎన్ఫీల్డ్ 2022 నవంబర్‌లో జరిగిన రైడర్ మేనియా 2022 ఈవెంట్లో సూపర్ మీటియార్ 650 (Super Meteor 650) బైక్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బైక్ ధరను ప్రకటించింది కంపెనీ. ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.3.49 లక్షలు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన ఖరీదైన బైక్ ఇదే కావడం విశేషం. (image: Royal Enfield)
2. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియార్ 650 మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఎక్స్ షోరూమ్ ధరలు చూస్తే ఆస్ట్రాల్ రూ.3.49 లక్షలు, ఇంటర్స్టెల్లార్ రూ.3.64 లక్షలు, సెలెస్టియల్ రూ.3.79 లక్షలు. సెలెస్టియల్ మోడల్‌నే రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియార్ 650 టూరర్ అని పిలుస్తారు. 650 ట్విన్స్ ప్లాట్ఫామ్లో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియార్ 650 మూడో బైక్. (image: Royal Enfield)
4. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియార్ 650 బరువు 241 కిలోలు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిల్లీమీటర్లు. సీటు ఎత్తు 740 మిల్లీమీటర్లు. ఫుల్ ఫీట్ ఫార్వర్డ్ ఫుట్ కంట్రోల్స్, లో స్కాలోప్డ్ సీటు, వైడ్ పుల్డ్ బ్యాక్ హ్యాండిల్‌బార్స్‌తో వస్తుంది. USD ఫ్రంట్ సస్పెన్షన్, LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, డ్యుయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లున్నాయి. (image: Royal Enfield)
5. సూపర్ మీటియార్ 650 మోటార్ సైకిల్ ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్స్టెల్లార్ గ్రే, ఇంటర్స్టెల్లార్ గ్రీన్, సెలెస్టియల్ బ్లూ, సెలెస్టియల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నిటారుగా రైడింగ్ పొజిషన్‌తో కూడిన అద్భుతమైన రెట్రో క్రూయిజర్ డిజైన్‌ను కలిగి ఉండటం విశేషం. (image: Royal Enfield)
7. ఇక సూపర్ మీటియార్ 650 టూరర్‌లో గ్రాండ్ టూరర్ యాక్సెసరీస్ కిట్ ఉంటుంది. ఇందులో డీలక్స్ టూరింగ్ డ్యూయల్-సీట్, టూరింగ్ విండ్‌స్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్, డీలక్స్ ఫుట్‌పెగ్స్, లాంగ్‌హాల్ ప్యానియర్స్, టూరింగ్ హ్యాండిల్ బార్, LED ఇండికేటర్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియార్ 650 కొనసాగుతున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి బైకుల డెలివరీ ప్రారంభం అవుతుంది. (image: Royal Enfield)