1. గ్లోబల్ మార్కెట్లలో వరుసగా లగ్జరీ బైక్స్‌ను రిలీజ్ చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ (Royal Enfield). పాత లైనప్‌ను రీఫ్రెష్ చేసి కొత్త వేరియంట్లను కూడా ఇండియాలో విడుదల చేస్తోంది. అయితే ఇటలీలోని మిలన్లో జరిగిన EICMA-2022 ఈవెంట్లో పాల్గొన్న కంపెనీ, ఈ వేదికపై సరికొత్త సూపర్ మెటార్ 650 (Super Meteor 650) బైక్‌ను ఆవిష్కరించింది. (Photo: Royal Enfield)
3. సూపర్ మెటార్ 650 బైక్‌లో, కంపెనీ ఇతర మోడళ్లలో వినియోగించిన ఇంజిన్నే అందిస్తోంది. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 వేరియంట్లలో అందించిన 648cc ట్విన్ ఇంజిన్ లేటెస్ట్ బైక్‌లో కూడా ఉంటుంది. ఇది 47 bhp పవర్‌ను, 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 241 కిలోల బరువు ఉండే ఈ వెహికల్, ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలోని 650cc సిరీస్‌లో అత్యంత భారీ మోడల్‌గా నిలుస్తోంది. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ, సీటు ఎత్తు 740 మిమీగా ఉంది. (Photo: Royal Enfield)
4. సూపర్ మెటార్ 650 ఫుల్ ఫీట్ ఫార్వర్డ్ ఫుట్ కంట్రోల్స్, లో స్కాలోప్డ్ సీటు, వైడ్ పుల్డ్ బ్యాక్ హ్యాండిల్‌బార్స్‌తో వస్తుంది. USD ఫ్రంట్ సస్పెన్షన్, LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, డ్యుయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లతో బైక్ రానుంది. 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 16 అంగుళాల బ్యాక్ వీల్స్‌తో బైక్ రన్ అవుతుంది. దీని ఇన్స్ట్రుమెంట్ క్లూజర్ రౌండ్ షేప్‌లో ఉంటుంది. 15.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో బైక్ సరికొత్తగా కనిపిస్తోంది. (Photo: Royal Enfield)
5. సూపర్ మెటార్ 650 మోటార్ సైకిల్ ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్స్టెల్లార్ గ్రే, ఇంటర్స్టెల్లార్ గ్రీన్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సూపర్ మెటార్ 650 టూరర్ బైక్ మాత్రం సెలెస్టియల్ రెడ్, సెలెస్టియల్ బ్లూ వంటి రెండు పెయింట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. (Photo: Royal Enfield)
6. EICMA ఈవెంట్లో ఎన్ఫీల్డ్ కంపెనీ సూపర్ మెటార్ 650 మూడు వేరియంట్లను ప్రదర్శించింది. వీటిలో సోలో టూరర్ జెన్యూన్ మోటార్‌సైకిల్ యాక్సెసరీస్ కిట్‌తో రానున్న ‘ఆస్ట్రల్ బ్లాక్ సూపర్ మెటార్ 650’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కిట్‌లో బార్ ఎండ్ మిర్రర్స్, డీలక్స్ ఫుట్‌పెగ్, సోలో ఫినిషర్, ఎల్ఈడీ ఇండికేటర్స్, మెషిన్డ్ వీల్స్ వంటి అనేక స్టైలింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. (Photo: Royal Enfield)
7. మరో మోడల్ సెలెస్టియల్ రెడ్ సూపర్ మెటార్ 650 టూరర్.. గ్రాండ్ టూరర్ యాక్సెసరీస్ కిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో డీలక్స్ టూరింగ్ డ్యూయల్-సీట్, టూరింగ్ విండ్‌స్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్, డీలక్స్ ఫుట్‌పెగ్స్, లాంగ్‌హాల్ ప్యానియర్స్, టూరింగ్ హ్యాండిల్ బార్, LED ఇండికేటర్స్ ఉన్నాయి. మరో మోడల్ ఇంటర్స్టెల్లార్ గ్రీన్ సూపర్ మెటోర్ 650ని స్టాండర్డ్ ఫార్మాట్లో ఆవిష్కరించింది. (Photo: Royal Enfield)