కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సమగ్ర విచారణ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రమాదానికి సంబంధించి డిటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్‌ను(DAR) నిర్దిష్టమైన సమయంలో రిపోర్ట్ చేయాలని కొత్త నిబంధన చేర్చింది. దీంతో బాధితులు మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) ద్వారా క్లైయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతకు ముందు ఫిబ్రవరి15, 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం 1989, CMVRలోని రూల్ 138ను సవరించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రూల్‌లో నాలుగేళ్లలోపు పిల్లలను బైక్‌పై తీసుకెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. వాటిని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం సవరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం ఈ నిబంధనలను నోటిఫై చేసింది. ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరి చేసింది. చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం క్రాష్ హెల్మెట్లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను కేంద్ర ప్రభుత్వం కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలు- 1989కి సవరణ ద్వారా కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. (ప్రతీకాత్మకచిత్రం)