2. ఢిల్లీలోని ఓ ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి ఈ మేరకు నోటీసులు అందాయి. ఈ కుప్రో నికెల్ (Cupronickel) కాయిన్లను బయటకు ఇవ్వవద్దని దానిలోని సారాంశం. అంటే బ్యాంకుకు వచ్చిన అలాంటి నాణేలను తిరిగి రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రమే తీసుకుంటుంది తప్ప వాటిని బయటకు ఇచ్చే అధికారం బ్యాంకుకు లేదన్న మాట. దీనిని బట్టి చూస్తే ఈ కాయిన్లు ఇక తిరిగి చెలామణీలోకి రాకపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. RBI నిబంధనలు, ICICI బ్యాంక్ బ్రాంచ్ నోటీసు ప్రకారం.. కొన్ని కుప్రొ నికెల్ నాణేలతోపాటు మరి కొన్ని నాణేలను వినియోగదారులకు ఇవ్వడానికి అనుమతులు లేవు. అందులో కుప్రోనికెల్తో చేసిన రూపాయి, అర్ధ రూపాయి, 25 పైసలు నాణేలు ఉన్నాయి. అదే విధంగా 10 పైసల స్టెయిన్లెస్ స్టీల్ నాణేలు, 10 పైసల బ్రౌంజ్ అల్యూమినియం నాణేలు, 20, 10 పైసల అల్యూమినియం నాణేలు, 5 రూపాయల అల్యూమినియం నాణేలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. అయితే ఇవి ఇక చెల్లుబాటు కావు అన్నదేమీ లేదు. చట్టపరమైనవే, అన్ని లావాదేవీల కోసం వీటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కానీ క్రమ క్రమంగా అవి మన మధ్య నుంచి మాయం అవుతాయన్న మాట. అయితే 2011 జూన్ చివరి నాటికి భారత ప్రభుత్వం 25 పైసలు, అంత కంటే తక్కువ విలువ ఉన్న అన్ని నాణేలను చెలామణి నుంచి తొలగించాలని భావించింది. దీంతో 25 పైసలు, అంతకంటే తక్కువ నాణేలు చెల్లుబాటు కావు. (ప్రతీకాత్మక చిత్రం)
5. 1990, 2000 సంవత్సరం ప్రారంభంలో ఎక్కువగా ఉపయోగించిన ఈ రూపాయి, అర్ధ రూపాయిలాంటి నాణేలు పాతగా మారడంతో వీటిని చెలామణి నుంచి తీసి వేస్తున్నారు. అంటే బ్యాంకులకు చేరుకున్న ఈ నాణేలను వారు ఆర్బీఐకి ఇచ్చేస్తున్నారు, తప్ప మళ్లీ బయటకు ఇవ్వరు. అలా క్రమక్రమంగా ఇవి మన నుంచి కనుమరుగవుతాయి. వీటి స్థానంలో కొత్త వాటిని బ్యాంకులు మనకు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)