1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్, రివర్స్ రెపో రేట్లను స్థిరంగా ఉంచింది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఆర్బీఐ రెపో రేట్ (Repo Rate), రివర్స్ రెపో రేట్లను పెంచలేదు. అయితే ఇటీవల కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడం, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న చర్చ జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా స్థిరంగా ఉంచడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగానే ఉండనున్నాయి. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోన్ టు వ్యాల్యూ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. రిస్క్ వెయిట్‌ను రేషనలైజ్ చేస్తామని, 2023 మార్చి 31 లోగా కొత్త ఇళ్లు కొనేవారికిలోన్ టు వ్యాల్యూకి లింక్ చేస్తామని ఆర్బీఐ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ గడువు పెంచడం వల్ల బ్యాంకులు మరిన్ని గృహ రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. లోన్ సైజ్, లోన్ టు వ్యూల్యూ రేషియోను బట్టి రిస్క్ వెయిట్ ఉంటుంది. ఆర్థిక పునరుద్ధరణలో రియల్ ఎస్టేట్ రంగం పాత్రను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 9 శాతానికి పైనే ఉండేవి. క్రమంగా వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి, ఇల్లు నిర్మించాలనుకునేవారికి మంచి అవకాశం లభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు పోటీపడి మరీ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 6.55 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.60 శాతం, సిటీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75 శాతం, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ 6.90 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలు ఇస్తుండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)