1. కార్డుతో జరిపే లావాదేవీలకు టోకెనైజేషన్ (Tokenisation) సిస్టమ్ తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఆన్లైన్ లావాదేవీలకు కూడా ఇది వర్తించేలా వ్యవస్థ రూపొందిస్తోంది. పేమెంట్ సంస్థలు టోకెనైజేషన్ వ్యవస్థను ప్రారంభించడానికి జూన్ 30 డెడ్‌లైన్ అని గతంలోనే ఆర్బీఐ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే ఈ డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడిగిస్తుందన్న వార్తలొచ్చాయి. తాము టోకెనైజేషన్ సిస్టమ్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 16 కోట్లకు పైగా టోకెన్స్ క్రియేట్ అయ్యాయని, ఈ ప్రగతిపై తాము సంతృప్తితో ఉన్నామని, జూలై 1 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. టోకెనైజేషన్ సిస్టమ్ అమలు చేయడానికి గడువు పొడిగించే అవకాశం లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ స్పష్టం చేశారు. కొన్ని సమస్యల్ని గుర్తించినా తాము పరిష్కరించి ముందుకు వెళ్తామని అన్నారు. వాస్తవానికి టోకెనైజేషన్ అమలు చేయడానికి గతేడాది డిసెంబర్ డెడ్‌లైన్‌గా ఉండేది. 2022 జనవరి 1 నుంచి టోకెనైజేషన్ అమలు కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కానీ పేమెంట్ కంపెనీలు, కార్డ్ నెట్వర్క్స్ అభ్యర్థనలతో ఆర్బీఐ గడువు ఆరు నెలలు పొడిగించింది. దీంతో 2022 జూలై 1 నుంచి టోకెనైజేషన్ అమలు చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అయితే మరోసారి ఆర్బీఐ గడువు పొడిగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటనల్ని బట్టి చూస్తే గడువు పొడిగించే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గడువు పొడిగించాలంటూ బ్యాంకులు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు లేదా ఆర్బీఐకి ఇప్పటివరకైతే ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు. కాబట్టి 2022 జూలై 1 నుంచి టోకెనైజేషన్ అమలు కావడం లాంఛనమే. టోకెనైజేషన్ అమలులోకి వస్తే ఇక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ తమ కార్డ్ వివరాలను పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో సేవ్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలకు ప్రత్యామ్నాయంగా టోకెన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ హోల్డర్ టోకెన్ రిక్వెస్టర్ యాప్ ద్వారా రిక్వెస్ట్ ప్రారంభించాలి. ఆ రిక్వెస్ట్ కార్డ్ నెట్‌వర్క్‌కు వెళ్తుంది. కార్డ్ జారీ చేసిన సంస్థ అనుమతితో టోకెన్ క్రియేట్ అవుతుంది. ఆ టోకెన్ ద్వారానే లావాదేవీలు జరపడానికి వీలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంటే మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు కార్డ్ వివరాలు ఎంటర్ చేయకుండా టోకెన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ నెట్వర్క్ ఈ టోకెన్ క్రియేట్ చేస్తుంది. సదరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీ కార్డ్ వివరాల బదులు టోకెన్ మాత్రమే సేవ్ అయి ఉంటుంది. ఆ టోకెన్ ద్వారానే ఇతర లావాదేవీలు జరపడానికి వీలవుతుంది. అయితే ప్రతీ లావాదేవీకి సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేయడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)