యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ అంశంలో చార్జీల విధింపు, కేవైసీ మార్గదర్శకాలు పాటించడంలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక.. మోసాల విషయంలో వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సంస్థలు పాటించాల్సిన వర్గీకరణ, రిపోర్టింగ్ నిబంధనలను పాటించనందుకు ఐడీబీఐ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.