2. ‘నో యువర్ కస్టమర్’ (KYC) డాక్యుమెంట్లకు సంబంధించిన బ్యాంకింగ్ స్కామ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పత్రికా ప్రకటనతో పాటు ట్వీట్లో వెల్లడించింది. వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ సంబంధిత సమాచారాన్ని స్కామర్లతో పంచుకోవద్దని ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. వారు పంపించే లింక్‌ని ఉపయోగించి KYC అప్డేషన్ కోసం కొన్ని అనధికార యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. కస్టమర్లు కాల్, మెసేజ్, అనధికార యాప్ ద్వారా సమాచారాన్ని పంచుకున్న తర్వాత.. నేరగాళ్లు వారి అకౌంట్‌ను యాక్సెస్ చేసి మోసాలకు పాల్పడతారని ఆర్బీఐ హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ధ్రువీకరించని లేదా అనధికార ఛానెల్స్, వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా కూడా అలాంటి వివరాలను షేర్ చేయవద్దని పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఎవరి నుంచైనా ఇలాంటి అభ్యర్థనలు వస్తే.. ఆ వివరాలు అందించాల్సిన అవసరం ఉందా అని ధ్రువీకరించుకోవడానికి బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. KYCని క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ (REలు) సూచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన మోసాలపై ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. REలు KYC పిరియాడిక్ అప్డేషన్ను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ, సంబంధిత మార్గదర్శకాలను కూడా ఆర్బీఐ గతంలో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)