1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త నియమనిబంధనలతో బ్యాంక్ కస్టమర్లకు ఊరట కల్పించింది. కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకు ఖాతాదారులు రీ-కేవైసీ కోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఆన్లైన్లోనే రీ-కేవైసీ ప్రాసెస్ (Re-KYC Process) పూర్తి చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా కేవైసీ వివరాలు అంటే నో యువర్ కస్టమర్ (Know Your Customer) డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. బ్యాంకులు తరచూ ఈ వివరాలను అప్డేట్ చేయాలని ఖాతాదారుల్ని కోరుతుంటాయి. సకాలంలో కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఖాతాదారులకు రీ-కేవైసీ చేయించడం ఓ సమస్యగా మారుతోంది. కేవైసీ చేయించాల్సిన సమయానికి ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాలతో వేరే ఊళ్లో ఉండటం, బ్యాంకుకు వెళ్లేందుకు వీలుకాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీ-కేవైసీ కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఖాతాదారుల ఇబ్బందుల్ని గుర్తించిన ఆర్బీఐ రీ-కేవైసీ కోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పిస్తోంది. వివరాల్లో ఎలాంటి మార్పులు లేనట్టైతే రీ-కేవైసీ కోసం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాంక్ ఖాతాదారులు బ్రాంచ్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా, అడ్రస్ కూడా అప్డేట్ చేయవచ్చు. పోస్ట్, రిజిస్టర్డ్ ఇమెయిల్-ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లాంటి డిజిటల్ ఛానెల్స్ ఉపయోగించి సెల్ఫ్-డిక్లరేషన్ ద్వారా రీ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసేలా అవకాశం కల్పించాలని బ్యాంకుల్ని ఆదేశించింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
5. దీని ద్వారా రీ-కేవైసీ కోసం ఖాతాదారులు బ్యాంక్ బ్రాంచ్‌లను సందర్శించాల్సిన అవసరం లేదు కాబట్టి వారికి పెద్ద ఉపశమనం లభించినట్టే. అయితే అడ్రస్‌లో మార్పులు ఉంటే ఖాతాదారులు పైన చెప్పిన పద్ధతుల్లో వివరాలు అప్డేట్ చేయొచ్చు. కానీ బ్యాంకు రెండు నెలల్లో వెరిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాతే అడ్రస్ అప్డేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఫ్రెష్ కేవైసీ విషయానికి వస్తే బ్యాంక్ రికార్డులలో గతంలో ఇచ్చిన కేవైసీ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంటే, అవి చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితాకు అనుగుణంగా లేకుంటే ఫ్రెష్ కేవైసీ చేయాలి. ఒకవేళ ఇంతకు ముందు సమర్పించిన కేవైసీ పత్రాల చెల్లుబాటు గడువు ముగిసినా ఫ్రెష్ కేవైసీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ కైవేసీ ప్రాసెస్ కోసం సమర్పించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఫ్రెష్ కేవైసీ చేసేవారికీ వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ. బ్యాంకు ఖాతాదారులు ఫ్రెష్ కేవైసీ కోసం వీలైతే బ్యాంకుకు వెళ్లొచ్చు. లేదా వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కేవైసీ పూర్తి చేయొచ్చు. ఫ్రెష్ కేవైసీ లేదా రీ-కేవైసీ ప్రాసెస్ కోసం అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్స్ గురించి కస్టమర్లకు అవగాహన కల్పించాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)