ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యూజర్ల భద్రత కోసం కీలక చర్యలు చేపట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పేమెంట్స్‌ను మరింత సురక్షితంగా మార్చడానికి ప్రతి వ్యాపారి (merchant), పేమెంట్ గేట్‌వే వద్ద అందుబాటులో ఉన్న సున్నితమైన కస్టమర్ డేటాను తొలగించాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏటీఎం కార్డ్ మోసాలు, మోసాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైబర్ మోసాలు" width="1200" height="800" /> దీనికి సంబంధించి 2022 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దీని ప్రకారం మర్చంట్లు లావాదేవీలు చేయడానికి ఎన్క్రిప్టెడ్ టోకెన్లను ఉపయోగించాలి. ఆర్బీఐ నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల గురించి బ్యాంకులు కూడా ఖాతాదారులకు తెలియజేయడం ప్రారంభించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ ఒక నోటీసు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. కార్డ్ జారీ చేసే సంస్థలు, కార్డ్ నెట్‌వర్క్‌లు కాకుండా కార్డ్ ట్రాన్సాక్షన్లు, పేమెంట్ చెయిన్లోని ఏ సంస్థ అయినా కస్టమర్ల కార్డ్ డేటాను స్టోర్ చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంతకు ముందు స్టోర్ చేసిన ఏదైనా డేటాను తక్షణమే తొలగించాలని కోరింది. అయితే ట్రాన్సాక్షన్ ట్రాకింగ్, రికన్షిలేషన్ ప్రయోజనాల కోసం.. కార్డ్ జారీచేసే సంస్థ పేరు, కార్డ్ నంబర్లోని చివరి నాలుగు అంకెలు వంటి డేటాను నిబంధనలకు అనుగుణంగా సంస్థలు (entities) స్టోర్ చేసుకోవచ్చని వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
డెబిట్ కార్డ్ ఆటో రెన్యువల్, డెబిట్ కార్డ్ రూల్స్, తెలుగు న్యూస్, తెలుగు వార్తలు" width="875" height="583" /> అంటే ట్రాన్సాక్షన్ కోసం కస్టమర్లు తమ కార్డు వివరాలను అందించాల్సిన అవసరం లేకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు. జనవరి నుంచి కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్లు చేయాలంటే.. మొదటిసారి మీ యాక్సెప్టెన్స్ తెలియజేస్తూ అదనపు అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
టోకెనైజేషన్ అనేది కస్టమర్లకు అదనపు సెక్యూరిటీని అందిస్తుంది. కార్డు హోల్డర్స్‌కు చెందిన సెన్సిటివ్ డేటాను టోకెన్‌లోకి మారుస్తుంది. కస్టమర్ల కార్డ్ డేటా, టోకెన్, ఇతర వివరాలను అధీకృత కార్డ్ నెట్‌వర్క్‌లు సెక్యూర్డ్ మోడ్‌లో స్టోర్ చేస్తాయని ఆర్బీఐ చెబుతోంది. మీ కార్డ్ వివరాలను ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో సేవ్ చేస్తే, సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు సైతం తగ్గుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)