1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో రెపో రేట్ 6.5 శాతానికి పెరిగింది. ఆర్బీఐ రెపో రేట్ పెంచగానే బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే లోన్లు తీసుకున్నవారికి, రుణాలు తీసుకోవాలని అనుకునేవారికి భారం పడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆర్బీఐ వరుసగా ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఈ పెంపు ఇక్కడితో ఆగేలా లేదు. మరోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచబోతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్ 3, 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచడానే మొగ్గు చూపుతుందన్నది తాజా వార్తల సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లు ఎంత పెంచుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోసారి 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెంచే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రెపో రేట్ 6.75 శాతానికి పెరుగుతుంది. మళ్లీ బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లు పెంచుతాయి కాబట్టి సామాన్యులపై ఈఎంఐ భారం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆర్బీఐ 2020 మే నుంచి 2022 మే వరకు రెపో రేట్ పెంచలేదు. అంటే రెండేళ్ల పాటు రెపో రేట్ స్థిరంగా ఉంది. 2022 మే నుంచి ఇప్పటి వరకు 7 సార్లు రెపో రేట్ పెరగడం విశేషం. 2022 మే 4న 40 బేసిస్ పాయింట్స్, 2022 జూన్ 8న 50 బేసిస్ పాయింట్స్, 2022 ఆగస్ట్ 8న 50 బేసిస్ పాయింట్స్, 2022 సెప్టెంబర్ 30న 50 బేసిస్ పాయింట్స్, 2022 డిసెంబర్ 7న 35 బేసిస్ పాయింట్స్, 2023 ఫిబ్రవరి 8న 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్బీఐ రెపో రేట్ పెంచిన ప్రతీసారి హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)