రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు బ్యాంకులపై కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించకపోవడంపై ఆంక్షలు విధించింది. తాజాగా మరో నాలుగు బ్యాంకుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.ఈ బ్యాంకు ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకునే విషయంలో ఆంక్షలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా జనతా సహకర బ్యాంక్, ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి (పశ్చిమ బెంగాల్), బహ్రైచ్‌లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు నగదు ఉపసంహరణ విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.