1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ రుపీ పైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న లాంఛ్ చేయనుంది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకుల్ని గుర్తించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ హోల్‌సేల్ (e₹-W) పైలట్ పేరుతో లాంఛ్ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రభుత్వ సెక్యూరిటీలలో సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం డిజిటల్ రుపీని వినియోగించనుంది ఆర్బీఐ. డిజిటల్ రూపాయిని ఉపయోగించడం వల్ల ఇంటర్‌బ్యాంక్ మార్కెట్ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆర్బీఐ భావిస్తోంది. ఇక రీటైల్ సెగ్మెంట్లో డిజిటల్ రుపీ వినియోగం కోసం కొన్ని ప్రాంతాల్లో మరో నెలలో రీటైల్ ఇ-రుపీ (e₹-R) ప్రారంభించనుంది ఆర్బీఐ. అంటే సాధారణ వ్యాపారులు, కస్టమర్లు కూడా డిజిటల్ రుపీ వినియోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆర్బీఐ అక్టోబర్ మొదటి వారంలోనే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి (CBDC) సంబంధించిన కాన్సెప్ట్ నోట్ రిలీజ్ చేసింది. ఆర్బీఐ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీ వినియోగదారులకు అదనపు చెల్లింపు మార్గంగా ఉంటుందని, ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవస్థల్ని రీప్లేస్ చేయడం లక్ష్యం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. సాధారణంగా CBDCల గురించి అవగాహన కల్పించడం, డిజిటల్ రూపాయి ప్రణాళికాబద్ధమైన ఫీచర్స్ తెలపడమే ఈ కాన్సెప్ట్ నోట్ జారీ వెనుక ఉద్దేశమని ఆర్బీఐ వివరించింది. ఆర్బీఐ రూపొందించే డిజిటల్ కరెన్సీకి e₹ అని పేరు పెట్టారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ ఆధ్వర్యంలో వస్తుంది. డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం ఉన్న కరెన్సీకి e₹ అదనంగా ఉంటుంది. బ్యాంకు నోట్లకు భిన్నంగా ఏమీ ఉండదు. కానీ డిజిటల్‌గా ఉండటం వల్ల సులభంగా, వేగంగా, చౌకగా ఉంటుంది. ఇది ఇతర రకాల డిజిటల్ కరెన్సీకి ఉన్నట్టుగానే లావాదేవీ ప్రయోజనాలు ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని పేపర్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో కూడా ఉంటుంది. చట్టబద్ధంగా ఎక్కడైనా చెల్లుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రస్తుతం డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో ఉన్నట్టు, డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది. కరెన్సీ నోటుకు ఎంత విలువ ఉంటుందో డిజిటల్ రుపీకి అంతే విలువ ఉంటుంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో వస్తున్న డిజిటల్ కరెన్సీ కాబట్టి కరెన్సీ నోట్ల చెల్లుబాటుకు ఆర్బీఐ ఎలా బాధ్యత తీసుకుంటుందో, డిజిటల్ కరెన్సీ చెల్లుబాటు బాధ్యత కూడా ఆర్బీఐదే. (ప్రతీకాత్మక చిత్రం)