RBI | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ – RBI) తాజాగా తీపికబురు అందించింది. బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. బ్యాంక్ లాకర్ కొత్త రూల్స్ అమలు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. లాకర్ అగ్రిమెంట్స్ రెన్యూవల్ గడువు పొడిగింపు వల్ల కస్టమర్లకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా అనేక సందర్భాల్లో బ్యాంకులు నిర్ణీత తేదీ (జనవరి 1, 2023) కన్నా ముందుగా కస్టమర్ల ద్వారా లాకర్ రెన్యూవల్ అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకోలేదని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా సవరించిన నిబంధనలకు అనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) రూపొందించిన మోడల్ అగ్రిమెంట్లో మార్పులు అవసరమని ఆర్బీఐ వివరించింది.