1. గతంలో బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఏటీఎంలు వచ్చిన తర్వాత ఏటీఎం కార్డులతో (ATM Cards) సులువుగా డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇప్పుడు ఏటీఎం కార్డులు కూడా అవసరం లేదు. బ్యాంక్ యాప్స్‌తో డబ్బులు డ్రా చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఇక యూపీఐ యాప్ ద్వారా కూడా డబ్బులు డ్రా చేయడం సాధ్యమే. (ప్రతీకాత్మక చిత్రం)
2. కార్డ్ ట్యాంపరింగ్, స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ లాంటి మోసాలను అడ్డుకోవడం కోసం అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్వర్క్స్ ఇంటర్ఆపరెబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (ICCW) సదుపాయాన్ని తమ ఏటీఎంలల్లో అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి కార్డు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు కాబట్టి మోసాలు తగ్గుతాయని ఆర్బీఐ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్స్‌లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అనుసంధానం చేయాలని కోరింది. లావాదేవీల్లో కస్టమర్ ఆథరైజేషన్ కోసం యూపీఐ ఉపయోగిస్తారు. ప్రస్తుతం యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేసే సదుపాయం కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కొన్ని బ్యాంకులు కేవలం తమ కస్టమర్లకు అది కూడా తమ బ్యాంకు ఏటీఎంలల్లో మాత్రమే యూపీఐ ద్వారా డబ్బులు డ్రా చేసే అవకాశం ఇస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు ఏటీఎంల ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ అందించాలని ఆర్బీఐ ఏప్రిల్‌లోనే కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆర్బీఐ బ్యాంకుల్ని ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. యూపీఐ ఉపయోగించడం ద్వారా అన్ని నెట్వర్క్స్, బ్యాంకుల్లో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫెసిలిటీని అందించాలని, ఆర్బీఐ కోరింది. లావాదేవీల సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఫిజికల్ కార్డ్ అవసరం లేకపోవటం వల్ల కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ లాంటి మోసాలను అడ్డుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇప్పటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లాంటి ప్రధాన బ్యాంకులు తమ బ్యాంక్ యాప్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూపీఐ యాప్ ద్వారా ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బులు డ్రా చేసే సదుపాయం కల్పించాలని ఆర్బీఐ కోరుతోంది. కాబట్టి త్వరలో అన్ని ఏటీఎంలల్లో యూపీఐ యాప్ ద్వారా డబ్బులు డ్రా చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)