2. అయితే ఇందుకోసం ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్బీఐ ఊరట కల్పించింది. రీ-కేవైసీ (re-KYC) కోసం ఖాతాదారులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే తమ కేవైసీ వివరాలు అప్డేట్ చేయొచ్చు. అడ్రస్‌లో ఏవైనా మార్పులు ఉంటే తప్ప, మిగతా వివరాలన్నీ ఆన్లైన్లోనే అప్డేట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. బ్యాంకు ఖాతాదారులు ఒకవేళ అడ్రస్ మార్చాలనుకుంటే బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా వివరాలన్నీ ఆన్లైన్లో సులువుగా అప్డేట్ చేయొచ్చు. ఖాతాదారులు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు కోరినప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రీ-కేవైసీ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాంకులు తమ ఖాతాదారుల్ని బ్రాంచ్‌కు రావాలని కోరకుండానే రీ-కేవైసీ పూర్తి చేయొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఒకవేళ బ్రాంచ్‌కు రావాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తే కస్టమర్లు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయొచ్చని శక్తికాంత దాస్ అన్నారు. కాబట్టి బ్యాంకు ఖాతాదారులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రీ-కేవైసీ చేయొచ్చన్న విషయం గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)