కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు, పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, అలాగే దేశంలో యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్‌ను ప్రారంభించడం గురించి ఓ కొత్త ప్రతిపాదన రాబోతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు జీ న్యూస్ హిందీ కథనం ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులకు కనీసం నెలకు రూ. 2,000 పెన్షన్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసినట్టు వార్తా కథనం వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కూడా కమిటీ కోరింది. పెన్షనర్లు ఈ ప్లాన్ నుంచి ప్రయోజనం పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
వ్యక్తిగత నైపుణ్యాలను డెవలప్ చేసేలా, ప్రతిభను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని నివేదిక సూచించింది. అంటే అసంఘటిత రంగంలో పని చేసేవారు, మారుమూల ప్రాంతాలలో ఉన్నవారు, శరణార్థులు, వలస వచ్చిన ప్రజలు, తగిన వనరులు లేని వారికి అధికారిక శిక్షణ అందించడం లాంటివి చేయాలి. నైపుణ్యం కలిగిన వ్యక్తుల లోటుతో ఏ డిపార్ట్మెంట్ కష్టపడకుండా చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)