Renault Offer: ఆఫర్ల వర్షం.. కారు కొంటే రూ.లక్షా 19 వేల తగ్గింపు, కంపెనీ భారీ డిస్కౌంట్!
Renault Offer: ఆఫర్ల వర్షం.. కారు కొంటే రూ.లక్షా 19 వేల తగ్గింపు, కంపెనీ భారీ డిస్కౌంట్!
Car Offers | మీరు కొత్త కారు కొనాలని చూస్తే మాత్రం ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? మీకోసం భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Car Discount |కొత్తగా కారు కొనాలని భావించే వారికి న్యూ ఇయర్ గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? కొత్త ఏడాది ఆరంభంలోనే కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కార్ల కంపెనీలు వరుస పెట్టి డిస్కౌంట్ ఆఫర్లు తీసుకువస్తున్నాయి.
2/ 10
ఇప్పటికే హోండా కార్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు తీసుకువచ్చాయి. ఇప్పుడు ఈ కంపెనీల జాబితాలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. రెనో ఇండియా కూడా కార్లపై డిస్కౌంట్ ఆఫర్లకు తెరతీసింది.
3/ 10
రెనో ఇండియా తన క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు తీసుకువచ్చింది. ఈ కార్లపై క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి ఉన్నాయి. ఇవ్వన్నీ కలుపుకుంటే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
4/ 10
రెనో క్విడ్ కారుపై ఏకంగా రూ. 91 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 15 వేలు వరకు ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 15 వేల వరకు లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 12 వేల వరకు ఉంటుంది.
5/ 10
స్క్రాపేజ్ బెనిఫిట్ రూ. 10 వేల వరకు పొందొచ్చు. ఇంకా లాయల్టీ బెనిఫిట్ కింద రూ. 39 వేల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇలా ఇవ్వన్నీ కలుపుకుంటే రెనో ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌పై భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. క్విడ్ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 4.7 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.
6/ 10
కైగర్ కారుపై ఏకంగా రూ.1.14 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కారుపై లాయల్టీ బెనిఫిట్ కింద రూ. 57 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. స్క్రాపేజ్ బెనిఫిట్ కింద రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 12 వేల దాకా వస్తుంది.
7/ 10
ఇవేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే క్యాష్ డిస్కౌంట్ రూ. 15 వేల వరకు ఉంటుంది. ఇకపోతే రెనో కైగర్ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.
8/ 10
చివరిగా ట్రైబర్ కారుపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై ఏకంగా రూ. 1.19 లక్షల దాకా తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ. 25 వేల దాకా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రూ. 25 వేల దాకా వస్తుంది.
9/ 10
ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 12 వేలు వరకు లభిస్త్ది. స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా రూ. 10 వేల వరకు వస్తుంది. అలాగే లాయల్టీ బెనిఫిట్ కూడా రూ. 47 వేల వరకు వస్తుంది. మొత్తంగా రూ. 1.19 లక్షల దాకా వస్తుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
10/ 10
ఇకపోతే కారు ఆఫర్ అనేది కారు వేరియంట్, డీలర్ షిప్, ప్రాంతం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల కారు కొనుగోలు చేయాలని భావించే వారు దగ్గరిలోని రెనో ఇండియా షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.