1. ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చినప్పటి నుంచి కస్టమర్లకు బ్యాంకులకు వెళ్లాల్సిన పని తప్పింది. మరీ అవసరమైతే తప్ప బ్యాంకుకు వెళ్లట్లేదు. చాలావరకు పనులన్నీ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా జరిగిపోతున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా భారీ లావాదేవీలు కూడా జరిపేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించేవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. కానీ డిజిటల్ బ్యాంకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాంటివి ఇతరులకు తెలిసాయంటే మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు ఎక్కడైనా ఈ వివరాలు రాసిపెట్టినా అవి ఇతరుల చేతుల్లోకి వెళ్తే మీ ఖాతాకు ముప్పే. అంతేకాదు... ఇలాంటి వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసినా మీ స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ మాత్రమే కాదు మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల నెంబర్స్, పిన్ నెంబర్స్ కూడా సేవ్ చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక మొబైల్ బ్యాంకింగ్ కోసం యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మీ లావాదేవీలు పూర్తి కాగానే లాగౌట్ చేయాలి. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయినప్పుడు కూడా పని పూర్తి కాగానే లాగౌట్ చేయడం మర్చిపోవద్దు. మళ్లీమళ్లీ పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఎందుకని బ్రౌజర్లో ఈ వివరాలు సేవ్ చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం మీరు వైఫై ఉపయోగిస్తున్నారా? ఇకపై ఎప్పుడూ ఆ పనిమాత్రం చేయొద్దు. ముఖ్యంగా పబ్లిక్ వైఫై అస్సలు ఉపయోగించకూడదు. షాపింగ్ మాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర పబ్లిక్ ప్లేసెస్‌లో మీ వైఫై ఉపయోగించే అలవాటు ఉన్నా, ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ కోసం వైఫై వాడకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
10. బ్యాంకులు రెగ్యులర్‌గా ట్రాన్సాక్షన్ అలర్ట్స్, స్టేట్మెంట్స్ పంపిస్తూ ఉంటాయి. బ్యాంకు మెయిల్ ఐడీ నుంచి కాకుండా ఇతరుల మెయిల్ ఐడీ నుంచి ఏవైనా బ్యాంకింగ్‌కు సంబంధించిన లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయకూడదు. పదే పదే అలాంటి వివరాలు వస్తున్నట్టైతే ఓసారి బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)