1. ఈ రోజుల్లో ఆరోగ్య బీమా (Health Insurance) ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారింది. మార్కెట్లో అనేక హెల్త్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి కొంత మొత్తం వరకే ఆసుపత్రి బిల్లులను చెల్లిస్తాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సాధారణ ఆరోగ్య బీమా ద్వారా వచ్చే మొత్తం ఆసుపత్రి ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పటికే మీరు చెల్లిస్తున్న ఆరోగ్య బీమా ప్లాన్ ద్వారా కవరేజీ పొందుతున్న మొత్తానికి సూపర్ టాప్అప్ పాలసీ ద్వారా అదనంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా డిడక్టబల్స్ (Deductibles) ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరంలో ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకున్నా తగ్గింపులను ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (Super Top UP Health Insurance Plan) ముగిసిపోయే వరకు ఇది ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. బేస్ ప్లాన్ కవరేజీ డిడక్టబుల్కు సమానంగా ఉండే విధంగా సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుంది. పాలసీదారులు ప్రస్తుత పాలసీ నుంచి డిడక్టబుల్ లిమిట్ కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఇది హామీ ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తానికి బీమా చేయవచ్చు. తక్కువ ప్రీమియంతో బిజినెస్ ప్లాన్ కవరేజీ పెంచుకోవచ్చు. బీమా చేసిన మొత్తంలో ఏ మాత్రం తగ్గకుండా కవరేజీ అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సహజంగా వయోజనులకు ఆరోగ్య బీమా ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా తక్కువ ప్రీమియంతో కవరేజీ పెంచుకోవచ్చు. బీమా కంపెనీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో నగదుతో పనిలేకుండా చికిత్స చేయించుకోవచ్చు. కాస్ట్ రీఎంబర్స్మెంట్ కూడా అందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80డి కింద సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులపై పన్ను రాయితీ లభిస్తుంది. చాలా పాలసీలు విస్తృత కవరేజీ ప్రయోజనాలు అందించడం లేదు. క్రిటికల్ కవర్ కూడా అందించడం లేదు. సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఉద్యోగులు పొందలేని కవరేజీ కూడా పొందవచ్చు. దీని ద్వారా కోవిడ్ 19 కు చికిత్స కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. సరైన డిడక్టబుల్ లిమిట్ ఉందా లేదా అనేది పాలసీదారుడు పరిశీలించాలి. సాధారణ బీమా పాలసీకి అదనంగా ప్రయోజనాలు అందిస్తుందో లోదో తెలుసుకోవాలి. ఈ ప్లాన్ పరిధిలో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రుల లిస్ట్ చెక్ చేయాలి. రెగ్యులర్ కవరేజీ ఆసుత్రులు ఈ పాలసీ నెట్వర్కులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఖర్చుతో కూడుకున్నవే. అయితే తీవ్రమైన అనారోగ్యాల కవరేజీకి మాత్రం చక్కగా ఉపయోగపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)