2. ఎందుకంటే ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించకపోతే తమకు రిస్క్ తక్కువగా ఉంటుందని బ్యంకులు భావిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇళ్లు, ఎల్ఐసీ పాలసీలను (LIC Policy) కొల్లాటరల్‌గా పెట్టుకొని రుణాలు ఇస్తుంటాయి బ్యాంకులు. ఇలాంటి రుణాలు తీసుకునే వ్యక్తులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి. అవేంటో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీరు ఏదైనా తాకట్టు పెట్టి లేదా కొల్లాటరల్‌గా చూపించి తీసుకునే రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఏ ప్రూఫ్ లేకుండా తీసుకునే రుణాల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే తక్కువ వడ్డీకి లోన్ వచ్చే ఆప్షన్స్ ఎంచుకోవాలి. మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉంటే ఆ పాలసీ చూపించి లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తిరిగి చెల్లించే మొత్తం తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎల్ఐసీ పాలసీలతో రుణాలు తీసుకునే వ్యక్తులు ఓ కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి పాలసీని కొల్లాటరల్ చూపించి లోన్ తీసుకున్నారనుకుందాం. లోన్ మొత్తం తిరిగి చెల్లించకుండానే సదరు వ్యక్తి మరణిస్తే, పాలసీ డబ్బులు మొత్తం నామినీకి రావు. అందులో లోన్ ఎంత చెల్లించాలో అంత బ్యాంకుకు వెళ్తుంది. మిగతా మొత్తం నామినీకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒకవేళ మీదగ్గర ఎల్ఐసీ పాలసీ ఉన్నట్టైతే, మీరు నేరుగా ఎల్ఐసీ నుంచి లోన్ తీసుకోవడమే ఉత్తమం. మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రీమియంలు చెల్లించారో, ఎంత మొత్తం చెల్లించారో లెక్కించి, మీకు ఇవ్వాల్సిన లోన్‌ను నిర్ణయిస్తుంది ఎల్ఐసీ. పాలసీ సరెండర్ వ్యాల్యూలో 90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ పాలసీ సరెండర్ వ్యాల్యూ రూ.5,00,000 ఉందనుకుందాం. మీకు గరిష్టంగా రూ.4,50,000 వరకు లోన్ వస్తుంది. వడ్డీ రేటు 9 శాతం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)