బ్యాంకులు దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటునే.. రికరింగ్ డిపాజిట్లపై కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. అయితే బ్యాంక్ ప్రాతిపదికన మాత్రం రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారతాయి. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన కూడా వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. ఏ ఏ బ్యాంకుల్లో ఆర్డీలపై ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకుందాం.
పీఎన్బీ ఆర్డీ రేట్ల విషయానికి వస్తే.. ఈ బ్యాంక్లో కూడా ఆకర్షణీయ వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్లో వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వస్తుంది. కాగా ఆర్డీ అకౌంట్లో ఒక్కసారి ప్రతి నెలా ఎంత కట్టాలని అనుకుంటారో.. టెన్యూర్ అయిపోయేంత వరకు ప్రతి నెలా అదే మొత్తం చెల్లిస్తూ రావాల్సి ఉంటుంది.