GST కింద సమన్లు అంటే ఏంటి? : సమన్లు అనేది పన్నుచెల్లింపుదారుడు అయినా? కాకపోయినా? ఒక వ్యక్తిని ఒక అధికారి పిలిచి విచారణ చేసే విధానం సమన్లు కిందకు వస్తుంది. ఏ విచారణ అయిన కూడా సమన్లుతోనే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి CGST చట్టంలోని సెక్షన్ 70 కింద వివరణాత్మక నిబంధన ఉంది. సాక్ష్యం అందించడానికి, పత్రాలను సమర్పించడానికి లేదా విచారణ కోసం ఒక వ్యక్తి హాజరును పిలిపించే అధికారం అధికారికి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి. సివిల్ న్యాయస్థానానికి సంబందించిన అధికారాలు అటువంటి అధికారులకు సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908 (CCP) కింద కల్పించారు. అవి న్యాయ విచారణల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
GST సమన్లకు స్పందించకపోతే? : ఒక అధికారి పంపిన సమన్లు కు అనుగుణంగా ఏ వ్యక్తి అయినా ఆ అధికారి ముందు విచారణకు హాజరుకావాలి. ఒకవేళ హాజరు కాకపోతే భారత పీనల్ కోడ్ సెక్షన్ 172, 174లో అందించిన విధంగా ఈ ఉల్లంఘన ప్రాసిక్యూషన్‌కు దారి తీస్తుంది. GST చట్టం ప్రకారం రూ.25,000 జరిమానా విధిస్తారు. అందువల్ల GST-నమోదిత వ్యక్తులు అయినా? కాకపోయినా? సమన్లకు స్పందించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
కారణాలతో కూడిన రాతపూర్వక రూపంలో సమన్లు జారీ చేయాలి : GST చట్టం ప్రకారం సమన్లు జారీ చేయడానికి సూపరింటెండెంట్లకు అధికారుల ముందస్తు అనుమతి (డిప్యూటీ లేదా అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ లేదా అంతకంటే ఎక్కువ) అవసరం. అది సాధ్యం కాకపోతే, మౌఖిక అనుమతి లేదా టెలిఫోనిక్ రికార్డ్ పని చేస్తుంది. దాన్ని తర్వాత రాతపూర్వక రూపంలోకి అనువదించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
GST అధికారుల నుంచి సమన్లు స్వీకరించిన తర్వాత తీసుకోవలసిన చర్యలు
GST చట్టం ప్రకారం సమన్లు అందితే.. సమన్లలో పేర్కొన్న తేదీ సమయంలో తప్పనిసరిగా అధికారి ముందు హాజరు కావాలి. తప్పనిసరిగా అవసరమైన వివరాలు, సహాయక పత్రాలను అందించాలి. ఒకవేళ హాజరు కాకపోతే పెనాల్టీ విధించవచ్చు, ప్రాసిక్యూషన్‌కి పిలవచ్చు. CCP 1908లోని 132,133 సెక్షన్ల ప్రకారం సంప్రదాయాల ప్రకారం బయట తిరగని మహిళలకు, ప్రత్యేక హక్కు కలిగిన వ్యక్తులకు మినహాయింపు ఉంటుంది. అటువంటి వ్యక్తులు సమన్లుకు హాజరు కావలసిన అవసరం లేదు. హాజరైనప్పుడు సమన్లు పంపిన అధికారి ఉన్నారో? లేదో? నిర్ధారించుకోవాలి. అధికారి గైర్హాజరు అయితే ముందుగానే రాతపూర్వకంగా లేదా మౌఖికంగా సంబంధిత వ్యక్తికి తెలియజేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)
GST ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, గతంలో దాఖలు చేసిన రిటర్న్‌ల ఆధారంగా ముఖ్యంగా 2017-18, 2018-19 సంవత్సరాలు ఆధారంగా పన్ను ఎగవేత దారులను గుర్తించే పనిని అధికారులకు అప్పగించారు. అందుకే ఈ మధ్య కాలంలో పన్ను ఎగవేత కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సమన్లుతో ప్రారంభమవుతుంది కాబట్టి , అనవసరమైన న్యాయపరమైన చిక్కులను నివారించడానికి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)