2. మరి మీకు కూడా మీ జీతం బోనస్‌గా వచ్చిందా? లేదా ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా? అయితే అలర్ట్. మీకు వచ్చిన బోనస్‌కు, గిఫ్ట్స్కు ట్యాక్స్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా? వీటికి మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీపావళి బోనస్‌ను నగదు రూపంలో ఇస్తాయి కంపెనీలు. ఉద్యోగులకు బోనస్‌ను వేతనాల ఆధారంగా ఇస్తాయి కంపెనీలు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కాబట్టి బోనస్‌ను సాలరీ నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. మీ వేతనానికి ఎలాంటి పన్నులు వర్తిస్తాయో బోనస్‌కు కూడా అవే పన్నులు ఉంటాయి. అంటే మీ శ్లాబ్ రేటును బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు మీ వార్షిక వేతనంతో బోనస్ కూడా కలిపి చూపించాలి. ఆ మొత్తం ఆదాయం లెక్కించి మీరు పన్ను చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి కంపెనీ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ విలువైన గిఫ్ట్ వోచర్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, టోకెన్లు పొందితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాటిని మీ వేతనాల వివరాల్లోనే వెల్లడించాలి. ఒక వేళ గిఫ్ట్ వోచర్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, టోకెన్లు రూ.5,000 లోపు ఉంటే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక మీ కంపెనీ గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు బహుమతులుగా పొందితే వాటికి కూడా పన్నులు చెల్లించాలి. వాటి వ్యాల్యూ ఎంత ఉందో లెక్కించి ఆదాయంలో చూపించాల్సి ఉంటంది. మీకు ఖరీదైన బహుమతులు వచ్చినట్టైతే తప్పనిసరిగా పన్నులు చెల్లించాలన్న విషయం గుర్తుంచుకోవాలి. కంపెనీ నుంచి కాకుండా స్నేహితులు బంధువుల నుంచి వచ్చే బహుమతుల సంగతేంటన్న అనుమానం రావొచ్చు. వాటికీ పన్నులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎవరైనా తాము స్వీకరించే బహుమతులకు ట్యాక్స్ వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లోపు బహుమతులు అందుకుంటే ఎలాంటి పన్నులు ఉండవు. అంతకన్నా ఎక్కువ విలువైన బహుమతులు పొందినట్టైతే వాటిని ఆదాయంగా చూపించి మీ శ్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాలి. అయితే బంధువుల నుంచి వచ్చే బహుమతులు పన్ను పరిధిలోకి రావు. (ప్రతీకాత్మక చిత్రం)
7. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామికి చెందిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల తోబుట్టువుల నుంచి బహుమతులు స్వీకరిస్తే పన్నులు వర్తించవు. స్నేహితుల నుంచి స్వీకరించే బహుమతులకు పన్నులు వర్తిస్తాయి. అయితే పెళ్లి, పుట్టినరోజు, వార్షికోత్సవం లాంటి సందర్భాల్లో వచ్చే బహుమతులకు పన్నులు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)