1. రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అనేక ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. ఇల్లు కొనేవారికి ఫర్నీచర్ కూడా ఉచితంగా ఇస్తాయి. ఇక ఇంట్లో రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మెషీన్ లాంటివి కూడా ఫ్రీగా ఇస్తుంటాయి. న్యూజిల్యాండ్‌లో ఓ కంపెనీ ఏకంగా టెస్లా కార్నే ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. న్యూజిల్యాండ్‌లోని బార్ఫుట్ అండ్ థాంప్సన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఓ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 7 బెడ్రూమ్ ఇల్లు కొనేవారికి టెస్లా మోడల్ వై కార్ ఉచితంగా ఇస్తామని ఈ రియల్ ఎస్టేట్ సంస్థ చెబుతోంది. టెస్లా కంపెనీ వై మోడల్ కార్ ధర సుమారు రూ.70 లక్షలు ఉంటుంది. 70 లక్షల విలువైన కార్ ఉచితంగా ఇస్తామని కంపెనీ ప్రకటించడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3. న్యూజిల్యాండ్‌లోని అతిపెద్ద నగరం అయిన ఆక్లాండ్ శివారులో 7 బెడ్రూమ్ ఇల్లు ఉంది. ద్వీప దేశం అయిన న్యూజిల్యాండ్‌లో ఏడాదిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ క్షీణిస్తోంది. గృహ రుణాలు భారం కావడంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గుతోంది. మార్ట్గేజ్ రేట్స్ కూడా ఎక్కువగా ఉండటంతో కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు అనేక ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ టెస్లా కార్‌ను ఉచితంగా ఇస్తామంటోంది. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్ముతున్న ఇంటి ధర సుమారు రూ.14 కోట్లు కాగా, ఈ ఇల్లు కొనేవారికి రూ.70 లక్షల విలువైన టెస్లా కార్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. న్యూజిల్యాండ్‌లో ఈ అడ్వర్టైజ్మెంట్ వైరల్‌గా మారింది. మూడు రోజుల్లోనే 50 ఇమెయిల్స్ వచ్చాయి. టెస్లా కార్ ఉచితం అనేసరికి కస్టమర్లలో ఆసక్తి కనిపించింది. కానీ ఒక్కరు కూడా ఇల్లు కొనేందుకు ముందుకు రాలేదు. నగరానికి శివారు ప్రాంతంలోని ఇల్లు కావడంతో కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)