రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు డెయిలీ బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 5.25 శాతంగా ఉంది. ఇక రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు డెయిలీ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు వడ్డీ రేటు 4 శాతంగా ఉంది.
ఇకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ రోజూ వారీ లెక్కింపు ద్వారా వడ్డీ మొత్తం నిర్ణయం అవుతుంది. వడ్డీ మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31, మార్చి 31 చొప్పున వడ్డీ డబ్బులు జమ అవుతాయి. కాగా ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఇప్పటికే చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై కూడా వడ్డీ రేట్లను సవరించాయి.