బ్యాంకుల్లో ఎన్పీఏ (నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్)లు ఆయా బ్యాంకులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారాయి. హిండెన్‌బర్గ్ కథనం నేపథ్యంలో అదానీ వ్యవహారం దేశం మొత్తం మీద చర్చనీయాంశంగా మారింది. అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన, అందులో పెట్టుబడులు పెట్టిన వాటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అయిదు బ్యాంకులు ఇవే..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దివాళా అంచున ఉన్న అయిదు సహకార బ్యాంకులు ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌సీబీఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఆదర్శ మహిళా నగరి సహకారి బ్యాంక్ మర్యాదిత్, శంకర రావు మోహిత్ పాటిల్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, శింశా సంహకారి బ్యాంక్ నియమితాపై ఆర్బీఐ చర్యలకు సిద్ధమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫిబ్రవరి 24 నుంచి ఈ బ్యాంకుల్లో నగదు విత్ డ్రా, డిపాజిట్ తదితర లావాదేవీలపై ఆంక్షలు విధించింది. సెంట్రల్ బ్యాంకు అనుమతి లేనిదే ఈ బ్యాంకులు కొత్త డిపాజిట్లు తీసుకోకూడదు. అదే విధంగా కొత్త రుణాలు మంజూరు చేయకూడదు. మొత్తం ఐదు బ్యాంకుల్లోని మూడు బ్యాంకులపై నగదు విత్ డ్రాపై పాక్షిక ఆంక్షలు అమలు చేయగా, రెండు బ్యాంకులపై పూర్తి స్థాయి ఆంక్షలు విధించింది.
ఖాతాదారుల సుముఖత మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా రూ.5 లక్షల వరకు అర్హులైన డిపాజిటర్లు నగదు పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆ అయిదు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా కార్యాచరణ అమలు చేస్తామని, తమ వైపు నుంచి సహకారం అందిస్తామని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)