1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేట్ 35 బేసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో రుణాల వడ్డీ రేట్లు పెరిగాయి. హోమ్ లోన్ (Home Loan) తీసుకున్నవారికి కూడా ఈఎంఐ భారం అవుతోంది. ఈ ఏడాది ఆర్బీఐ ఏకంగా 225 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. అంటే ఈ ఏడాది వడ్డీ రేట్లు 2.25 శాతం పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఫ్లోటింగ్ రేట్ కింద హోమ్ లోన్, కార్ లోన్ (Car Loan), ఇతర రుణాలు తీసుకున్నవారికి ఆ మేరకు ఈఎంఐ భారం అవుతోంది. 2019 అక్టోబర్ 1 నుంచి బ్యాంకులన్నీ ఫ్లోటింగ్ రేట్ కింద రీటైల్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌కు లింక్ అయిన రుణాలు. ఆర్బీఐ రెపో రేట్ పెంచిన ప్రతీసారి ఈ వడ్డీ రేట్లు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆర్బీఐ రెపో రేట్ పెంచినప్పుడు ఇప్పటికే రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐ పెరుగుతుంది. ఇందుకు కారణం వడ్డీ రేటు పెరిగినప్పుడు ఈఎంఐ పెంచే ఆప్షన్ ఎంచుకోవడమే. వారికి ఇప్పటివరకు 20 శాతం వరకు ఈఎంఐ భారం అయింది. హోమ్ లోన్ కస్టమర్లకు మరో ఆప్షన్ కూడా ఉంటుంది. ఈఎంఐ బదులు టెన్యూర్ అంటే కాల వ్యవధి పెంచుకోవచ్చు. కాబట్టి వారు ఈఎంఐ చెల్లించాల్సిన నెలలు కొన్ని పెరుగుతాయి. మరి ఆర్బీఐ ఇటీవల 35 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడంతో ఈఎంఐ ఎలా భారం అయిందో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉదాహరణకు ఓ వ్యక్తి 20 ఏళ్ల కాలవ్యవధితో రూ.25 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. 8.50 శాతం వార్షిక వడ్డీ లెక్కన రూ.21,696 ఈఎంఐ చెల్లించారు. ఇప్పుడు 35 బేసిస్ పాయింట్స్ పెరగడంతో రూ.22,253 ఈఎంఐ చెల్లించాలి. ఇక 20 ఏళ్ల కాలవ్యవధితో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. 8.50 శాతం వార్షిక వడ్డీ లెక్కన రూ.43,391 ఈఎంఐ చెల్లించారు. ఇప్పుడు రూ.44,505 ఈఎంఐ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరి ఈఎంఐ పెంచుకోవడం లాభమా? కాలవ్యవధి పెంచుకోవడం లాభమా? అన్న సందేహం హోమ్ లోన్ కస్టమర్లలో ఉండటం మామూలే. ఇందుకు మరో ఉదాహరణ చూద్దాం. ఓ వ్యక్తి 8.50 శాతం వార్షిక వడ్డీతో 20 ఏళ్లు అంటే 240 నెలల టెన్యూర్‌తో రూ.75 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం. ఈఎంఐ రూ.65,087 చెల్లించాలి. లోన్ పూర్తయ్యేసరికి చెల్లించే వడ్డీ రూ.81,20,818 అవుతుంది. ఇప్పుడు వడ్డీ రేటు పెరిగింది కాబట్టి 8.85 శాతం ప్రకారం లోన్ తీసుకుంటే రూ.66,758 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం రూ.85,21,829 వడ్డీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంటే 8.50 శాతంతో పోలిస్తే 8.85 శాతం ప్రకారం అదనంగా రూ.4,01,011 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈఎంఐ పెంచుకుంటే రూ.4,01,011 వడ్డీ భారం అవుతుంది. ఈఎంఐ పెంచుకోకుండా 18 నెలలు అదనంగా పాత ఈఎంఐ కొనసాగించాలనుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రూ.92,4,040 అవుతుంది. అంటే 18 నెలలు అదనంగా ఈఎంఐ చెల్లించేందుకు అంగీకరిస్తే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ.11,73,222 అవుతుంది. ఈ లెక్కన టెన్యూర్ పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంచుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక్కడ హోమ్ లోన్ తీసుకున్నవారు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ప్రతీ నెలా కొంత ఈఎంఐ పెరిగినా తమకు భారం కాదనుకుంటే మాత్రం ఈఎంఐ పెంచుకొని లోన్ చెల్లించడమే మంచిది. కానీ ఇతర ఖర్చులు, ఈఎంఐలు, ఇంటి బడ్జెట్ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎంఐ పెంచుకోవడం భారం అనుకుంటే మాత్రం టెన్యూర్ పెంచుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో చూస్తే టెన్యూర్ పెంచుకుంటే జేబులోంచి అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)