రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 లో గ్లోబల్ హ్యాకథాన్ (Hackathon) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో గ్లోబల్ హ్యాకథాన్ హార్బింగర్ 2023 (HARBINGER 2023) ప్రకటించింది. పరివర్తన కోసం ఆవిష్కరణ పేరుతో ఈ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. పలు సమస్యలకు, అంశాలకు పరిష్కారాలు సూచించాలని ఆర్బీఐ కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ కాంటెస్ట్‌లో పాల్గొని రూ.40 లక్షల వరకు బహుమతుల్ని గెలుచుకోవచ్చు. హ్యాకథాన్‌లో దివ్యాంగులకు డిజిటల్ ఫైనాన్షియల్ సేవలను అందుబాటులోకి తెచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉండే పరిష్కారాలను అభివృద్ధి చేయాలని కోరుతోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల పరిధిని విస్తరించడం, బ్లాక్‌చెయిన్‌ల స్కేలబిలిటీని పెంచడం లాంటి అంశాలపై ఐడియాలను కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
హార్బింగర్ 2023లో నాలుగు సమస్యలకు వినూత్న పరిష్కారాలను, ఆలోచనలను ఆహ్వానిస్తోంది ఆర్బీఐ. 1. దివ్యాంగుల కోసం వినూత్నమైన, ఉపయోగించడానికి సులభమైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు. 2. రెగ్యులేటెడ్ ఎంటిటీల (REs) ద్వారా మరింత సమర్థవంతమైన సమ్మతిని సులభతరం చేయడానికి RegTech పరిష్కారాలు. 3. ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలతో సహా CBDC-రిటైల్ లావాదేవీల కోసం వినియోగ కేసులు, పరిష్కారాలను అన్వేషించడం. 4. సెకనుకు లావాదేవీలను పెంచడం (TPS), బ్లాక్‌చెయిన్‌ల స్కేలబిలిటీ. (ప్రతీకాత్మక చిత్రం)
హార్బింగర్ 2023 హ్యాకథాన్‌కు అప్లై చేయడానికి ముందుగా https://fintech.rbi.org.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. RBI Initiatives లో HARBINGER 2023 లింక్ పైన క్లిక్ చేయాలి. నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి. ఆ తర్వాత https://hackolosseum.apixplatform.com/h1/harbinger2023 లింక్ పైన క్లిక్ చేయాలి. మరో లింక్ ఓపెన్ అవుతుంది. New to APIX – Register పైన క్లిక్ చేసి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
రిజిస్ట్రేషన్ చేయడానికి 2023 ఫిబ్రవరి 22 చివరి తేదీ. ఎంపికైనవారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్య ప్రకటనలకు సంబంధించిన ప్రతిపాదనలు సబ్మిట్ చేయాలి. ప్రపోజల్స్ సబ్మిట్ చేయడానికి 2023 మార్చి 24 చివరి తేదీ. 2023 జూన్ 9 లోగా ఫైనలిస్టుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎక్స్టర్నల్ ప్యానెల్ ద్వారా ప్రతిపాదనల్ని సమీక్షిస్తారు. పరిష్కారాల అభివృద్ధి 2023 జూలై 8 లోగా చేయాలి. 2023 ఆగస్ట్ 14న గ్రాండ్ ఫినాలె ఉంటుంది. అదే రోజున తుది మూల్యాంకనం, విజేతల ప్రకటన ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)