ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ (Internet) లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి. మనీ ట్రాన్స్ఫర్లు, ఆన్లైన్ పేమెంట్లు ఇలా ఏది జరగాలన్నా మన డివైజ్‌లో ఇంటర్నెట్ ఉండి తీరాల్సిందే. ఫోన్లో డేటా కోటా అయిపోయినా, సిగ్నల్ లేకపోయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు ఆటంకం ఏర్పడుతుంది. అయితే ఇకపై ఈ తిప్పలు తప్పనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఎందుకంటే ఆఫ్లైన్లోనూ డిజిటల్ పేమెంట్లకు (Digital Payments) అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, ఈ ఆఫ్‌లైన్ పేమెంట్ విధానంలో ఒకేసారి గరిష్టంగా రూ. 200 మాత్రమే పంపించవచ్చు. ఇలా ఒకరోజు రూ. 2000 వరకు ఆఫ్‌లైన్ మోడ్‌లో (Offline mode) ట్రాన్సాక్షన్ చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆఫ్‌లైన్ విధానంలో డిజిటల్ పేమెంట్లు చేయవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో చెల్లింపులను ప్రాక్సిమిటీ మోడ్ (ఫేస్ టు ఫేస్) విధానంలో నిర్వహిస్తారు. కార్డులు, వ్యాలెట్లు, మొబైల్ డివైజెస్లతో ఈ విధానంలో చెల్లింపులు చేసుకోవచ్చు. కాబట్టి, ఈ లావాదేవీలకు అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ అవసరం ఉండదని ఆర్బీఐ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంటర్నెట్ కనెక్టివీటీ లేని ప్రాంతాలకు ఉపయోగకరం..
ఈ కొత్త విధానంపై ఆర్బీఐ ట్వీట్ చేస్తూ “ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా లేని మారుమూల ప్రాంతాల్లో సైతం డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విధానాన్ని తీసుకొచ్చాం. అయితే, పరిమిత ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 200 వరకు, మొత్తం మీద అన్ని లావాదేవీలకు గరిష్టంగా రూ. 2000 (తిరిగి ఆన్లైన్ ద్వారా బ్యాలెన్స్ యాడ్ చేసుకునే వరకు) మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బలహీనమైన నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లు తోడ్పడతాయి. డిజిటల్ పేమెంట్లను మరింత సులభతరం చేసేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. (ప్రతీకాత్మక చిత్రం)