Bank Holidays | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ – RBI) తాజాగా బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు మార్చి 31న కూడా తెరిచే ఉండాలని తెలియజేసింది. మార్చి 31న వర్కింగ్ అవర్స్ ఉన్నంత వరకు బ్యాంక్ బ్రాంచులకు తెరిచే ఉంచాలని వెల్లడించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యాన్వల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మార్చి 31న ఉంటుంది.