తాజాగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా పట్టాలెక్కింది. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం ఎనిమిది వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూర్, బిలాస్పూర్-నాగ్పూర్, న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్ క్యాపిటల్ - ముంబయి, హౌరా - న్యూ జల్పైగురి మార్గాల్లో ఇవి తిరుగుతున్నాయి.
* 58 సార్లు భూమిని చుట్టివచ్చినంత దూరం ప్రయాణించాయి : సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఇప్పటికే ప్రారంభం అయిన ఏడు వందే భారత్ రైళ్లలో ఇప్పటి వరకు 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారన్నారు. ఈ రైళ్లు ఇప్పటి వరకు 23 లక్షల కిలోమీటర్ల దూరాన్ని చుట్టి ప్రయాణించాయన్నారు. ఆ దూరం 58 రౌండ్లు భూమిని చుట్టి రావడానికి సమానం అని చెప్పారు.
* ఎరోప్లేన్ను మించిన డిజైన్: మన దేశంలోని ఈ వందే భారత్ రైళ్ల డిజైన్ చాలా అత్యుత్తమమైనదని, అవి విమానం కంటే మెరుగైన డిజైన్ని కలిగి ఉన్నాయని రైల్వే మంత్రి వైష్టవ్ తెలిపారు. ఇవి అత్యంత సౌకర్యవంతమైన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని అందిస్తాయన్నారు. ఇవి 52 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవని, అయితే ప్రపంచంలోని మిగిలిన రైళ్లు అందుకు 54 నుండి 60 సెకన్లు తీసుకుంటాయని తెలిపారు.