దేశ రాజధాని ఢిల్లీలో ఓ పెద్దాయన కాకులను పెంచుకొని ఉపాధి పొంతున్నాడు. అందేంటి అనుకుంటున్నారా.. రెండు చేతులా సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నాడు. కాకులను ఉపాధి వనరుగా మార్చుకున్నాడు. పిండం ముట్టేందుకు కాకులు రాని కాలంలో ఓ వ్యక్తి కాకులను పెంచుకుంటూ పిండం ముక్కుతో తాకించే వ్యాపారం చేస్తున్నాడు. ఆనోట ఈనోట ఇతగాడి గురించి తెలిసి ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. ఎవరైనా చనిపోయినప్పుడు హిందు సంప్రదాయ ప్రకారం మూడో రోజు, ఆ తర్వాత 11వ రోజున ఆ వ్యక్తికి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేసి అంత్యక్రియలు జరిగిన చోట పెట్టడం ఆనవాయితీ. (image credit : shutterstock)
వాటి సంతతి గణనీయంగా తగ్గింది. పట్టణీకరణ వేగవంతమవుతున్న తరుణంలో కాకుల జాడ కానరాకపోవడం ఆ పెద్దాయనను కదిలించింది. దాంతో రెండు కాకులను పెంచుకుంటూ తనకు ఉపాధిమార్గంగా మలచుకున్నాడు. ఎక్కడైనా పిండప్రదానాలకు, వైకుంఠ సమారాధనలకు కాకులతో వాలిపోతూ కాసిన్ని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ((mage Credit : Youtube)