1. ట్రైన్ టికెట్ బుక్ చేసేవాళ్లు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. ఏ స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేస్తే ఆ స్టేషన్లోనే రైలు ఎక్కాలి. వేరే స్టేషన్లో రైలు ఎక్కాలనుకుంటే బోర్డింగ్ పాయింట్‌ను ముందుగానే సెలెక్ట్ చేయాలి. ఇలాంటి నిబంధనలు తరచూ ట్రైన్ టికెట్ బుక్ (Train Ticket Booking) చేసేవారికి తెలుసు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ మీకు ట్రైన్ టికెట్ బుక్ చేశాక, తర్వాతి స్టేషన్లో రైలు దిగాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తారు? దీనికీ భారతీయ రైల్వే (Indian Railways) ఓ వెసులుబాటు కల్పిస్తోంది. మీరు దిగాల్సిన స్టేషన్లో కాకుండా ఆ తర్వాతి స్టేషన్లో కూడా రైలు దిగొచ్చు. ప్రయాణికులు రైలులో ఉండగానే ఈ మార్పు చేసుకోవచ్చు. మరి ఆ నియమనిబంధనలు ఏంటో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రయాణికుల సౌలభ్యం భారతీయ రైల్వే మొదటి ప్రాధాన్యతగా ఉంటోంది. అందుకు అనుగుణంగా, భారతీయ రైల్వే ప్రయాణికుల షెడ్యూల్లో మార్పులను సులభతరం చేస్తోంది. ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లో మార్పులు చేసేందుకు అవకాశం ఇస్తోంది. ఇందుకు తగ్గట్టుగా రైల్వే టిక్కెట్లకు సంబంధించిన నిబంధనల్లో వెసులుబాటు కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అందులో భాగంగా రైల్వే మరో వెసులుబాటు కల్పించింది. రైల్వే ప్రయాణికులు తాము బుక్ చేసుకున్న గమ్యస్థానానికి కాకుండా ఇంకా ముందుకు ప్రయాణించాలనుకుంటే రైలు టికెట్లో మార్పులు చేయొచ్చు. టికెట్ ఎక్స్టెండ్ సర్వీస్ పేరుతో కొత్తగా ఈ సేవను అందిస్తోంది. ఇందుకోసం రైల్వే ప్రయాణికులు రైలులో ఉన్న టీటీఈ దగ్గరకు వెళ్లి తమ టికెట్ చూపించాలి. తాము ఇంకా ముందుకు ప్రయాణించాలనుకుంటున్నట్టు చెప్పాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రయాణీకులు కోరుకున్నంత దూరం ప్రయాణించడానికి టీటీఈ టిక్కెట్లో మార్పులు చేస్తారు. ఇందుకోసం అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ పాయింట్-టు-పాయింట్ ప్రాతిపదికన ఉంటుందని గమనించాలి. అంటే మీరు దిగాల్సిన స్టేషన్ నుంచి పొడిగించబడిన స్టేషన్ వరకు టికెట్ ధర ఎంత ఉంటుందో అంత టీటీఈ ఛార్జ్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ప్రయాణికుల సంఖ్య 50 మంది వరకు ఉంటే చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్కు, 50 నుంచి 100 మంది ప్రయాణికులైతే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ లేదా డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌కు అప్లై చేయాలి. 100 కన్నా ఎక్కువ మంది ప్రయాణికులైతే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌కు దరఖాస్తు చేయాలి. ఏసీ రైళ్లల్లో అయితే 10 మంది ప్రయాణికుల వరకు చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్కు దరఖాస్తు చేయాలి. అంతకన్నా ఎక్కువ సీట్లు కావాలంటే సీనియర్ అధికారులకు దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)