ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ.. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య 8వ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును సౌత్ సెంట్రల్ రైల్వే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏప్రిల్ 8న తేదీన ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఎక్కువగా తిరుపతికి ప్రయాణాలు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేస్తుంటారు. అయితే దాదాపు వీటిలో ప్రయాణం రైల్వే ద్వారానే జరుగుతుంటుంది. ఇప్పటికే అనేక రైల్వే సర్వీసులను తిరుపతికి నడిపిస్తున్నా.. రద్దీ మాత్రం తగ్గండం లేదు. ఈ క్రమంలో రద్దీని తగ్గించడానికి ఈ సర్వీసు దోహదపడుతుందని భారతీయ రైల్వే భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)